కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
crime news
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్వామి వివేకానంద 161 వ జయంతి పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం సభ్యులు మరియు ఏబీవీపీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం. దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్. థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో చోటు చేసుకున్న ఘటన. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు. గొడవ జరగకుండా చూసేందుకు, థియేటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారని పోలీసులు. అతను రన్నింగ్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ చేస్తాడని గుర్తించామన్నారు. ఐదు చైన్ స్నాచింగ్ కేసుల్లో చిన్నయ్య నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 14 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రన్నింగ్ ట్రైన్ లో విండో నుంచి మహిళల మెడలో చైన్స్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడికి గంజాయి అలవాటు ఉందని తెలిపారు. డ్రగ్స్ కి బానిసై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది. నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం. నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి. 26మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా. బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్‌కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్‌తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.