శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
crime news
మంచిర్యాల జిల్లా, మందమర్రి పట్టణం లోని ప్రవేట్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులకు మెహందీ (మైదాకు) పోటీలు నిర్వహించరు. 4 నుంచి 9వ తరగతి వరకు 74 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలు ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా ఆధ్వర్యంలో జరిగాయి. ఇలాంటి మెహందీ పోటీలలో పాల్గొన్న విద్యార్ధినులు, తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాడేపల్లి, సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. మెగా డిఎస్సి ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి పిలుపు ఇచ్చిన విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాల పిలుపుతో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని రోడ్డు మార్గాలలో భద్రత పెంపు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది.
విజయవాడ, బుద్ధ వెంకన్న, టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు. ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను. కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమ సారధి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన. మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు.
విజయవాడ, కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు. నిన్నటివరకూ చంద్రబాబు, కెసినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్. పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు. బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ల ఏర్పాటు. ఎన్టీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు.
కేంద్రం నూతన చట్టానికి నిరసన సెగ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా భైంసా డిపో పరిధిలో నిలిచిపోయిన ఆర్టీసీ అద్దె బస్సులు. డిపో పరిధిలో అద్దె బస్సులను నిలిపివేసి ప్రైవేటు బస్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పెంపును వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. పాత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు. నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్లు జైలు శిక్ష, రూ.ఏడు లక్షలు జరిమానా విధించేలా మార్పులు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.
కాకినాడ, ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ. కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు.