కర్నూలు, పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కాల్పులు కలకలం. పార్కింగ్ విషయంలో ఘర్షణ పడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లు. వెంకటేశం అనే లారీ డ్రైవర్ పై రాయితో దాడి చేసిన మరో లారీ డ్రైవర్ శ్రవణ్ కుమార్. గాయాలపాలైన వేంకటేశం తన వద్ద లైసెన్స్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకొని ఇరువురు లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసారు.
Crime
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలలుగా ఖాళీ చేయకపోవడంతో గురువారం ఉదయం పోలీసు వారు బ్యాంకు వారు సహకారంతో జయరామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ప్రహరీ గోడను ప్రోక్లైనర్ తో తొలగిస్తుండగా సుశీల భర్త బకెట్లతో పెట్రోల్ తీసుకొచ్చి జెసిబి పైన, వచ్చిన వారిపైన వెదజల్లగా భయానికి లోనై జయరాం అతని మిత్రులు పారిపోగా జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో జెసిబి డ్రైవర్ కేకలు పెడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతుండగా గమనించి మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని బంధువులు తెలిపారు. సుశీల భర్తను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు.
అంబర్‌పేట లో ఇద్దరు యువతుల పై ఇంట్లోకి దూరి కత్తి తో దాడి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక, ఇంట్లో ట్యూషన్స్ చెబుతున్న మరో యువతి వీరిద్దరి పై కత్తి తో కడుపు లో పొడిచిన దుండగుడు. విద్యానగర్ ఏఎంఎస్ హాస్పిటల్ కు బాధితుల తరలింపు. బాధితులు ఇద్దరు బందువులు దాడికి పాల్పడ్డది 16 సంవత్సరాల మైనర్ బాలుడు అని తెలిపారు.
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
చిత్తూరు జిల్లా కలకడ పట్టణంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. కలకడ పట్టణం లోని మంగళపల్లి జాతీయ రహదారి పక్కన ఎర్రయ్య గారి పల్లెకు చెందిన ఆనంద్, తన భార్య శశికళతో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. మహిళపై దాడి చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Read Also..
Read Also..
తిరుపతి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట పట్టణంలోని సెబ్ కార్యాలయంలో సెబ్ సీఐ RUVS ప్రసాద్, గూడూరు సెబ్ డీఎస్పీ జె రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గస్తీ నిర్వహించామన్నారు. నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు మూడులక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పటిష్టంగా చర్యలు చేపట్టినట్లు సెబ్ డీఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే సమాచారం అందించాలని ప్రజలను రమేష్ కోరారు.
Read Also..
Read Also..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్‌పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మృతి తర్వాత సైఫ్ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేశారు. గతేడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ర్యాగింగ్ కమిటీ ఎదుట సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొనడంతో, సైఫ్‌పై నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.






Total views : 90621