దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా పి గన్నవరంలో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గన్నవరం మండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. పి గన్నవరం పట్టాభి రామాలయం నుంచి గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. అలాగే ఈరోజు ముంగండ గ్రామంలో అయోధ్యకర సేవకులకు ఘన సత్కారం చేశారు. ప్రతి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
Crime
సీతారాములను ఆరాధించడంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని వరంగల్ మార్వాడి సమాజ్ ప్రతినిధి గబ్బర్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళ నేడు సహకారం అయిందని అన్నారు. అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలో మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్రను ఘనంగా నిర్వహించారు. వీధి నుండి రామన్నపేట వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాత్రలో సేవా సమాజ్ ప్రతినిధులు మహిళలు యువతీ యువకులు పాల్గొని శ్రీరామ నామం పలుకుతూ నృత్యాలు చేస్తూ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి గబ్బర్ సింగ్, రాజసింగులు మాట్లాడుతూ సీతారాములను కొలవడం ద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని వారన్నారు. అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వారన్నారు.
అయోధ్య రామ మందిరం నిర్మాణం, శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శ్రీ రామాలయం లో కాకినాడ జిల్లా బిజెపి కార్యదర్శి కాళ్ళ ధనరాజ్, నాయకులు సత్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో తిలకించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టం అయితే ఈ రోజు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇంతటి మహోత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగటం ప్రతి హిందువు గర్వించదగిన విషయమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎదురైన అయోధ్య లో రామాలయం నిర్మించడం తో దేశ ఖ్యాతి ప్రపంచ నలుదిశలా వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల దొరబాబు, పేదిరెడ్ల దుర్గ బాబు, సత్యనాందం, ఎన్.దొరబాబు, ఊట రాంబాబు, ఎన్.కృష్ణమూర్తి , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చలో అమరావతి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వెళ్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేము ఏమి తప్పు చేశామని శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని అంగన్వాడీలు మండిపడ్డారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న మమ్మల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మమ్మల్ని అన్యాయంగా రోడ్డుపాలు చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కూడా వచ్చేలా చేశారని వారు అన్నారు. మాకు వచ్చే 11500 జీతంతో ఏ కుటుంబమైన గడుస్తోందన అని, మమ్మల్ని ఇక్కడ ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని కచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా, రన్నర్ గా రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా, రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు.
చిత్తూరు జిల్లా, కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి, మంజుల మీడియాతో మాట్లాడుతూ, తమ బిడ్డ సంజయ్ ను శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్ళాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ లో చివరిగా మాట్లాడామని తెలిపారు. కాగా పక్కా ప్లాన్ తోనే సంజయ్ ను రివిందర్, బాలాజి, రోహిత్ లు చెంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసమే తమ కుమారుడిని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. తమ కుమారుడు ఆచుకిని కనుగొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన గుడిపూడి విగ్నేష్ 22. ఫోన్ యాప్ లో ఇటీవల లోన్ తీసుకున్న విగ్నేష్.. యాప్ వారు ఫోన్లో పెడుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విగ్నేష్.. ఫోన్ లో లోన్ యాప్ లో అప్పు తీసుకోవటం తో తిరిగి చెల్లించలేక నిండు ప్రాణాలు బాలి చేసుకున్న విగ్నేష్.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




Total views : 90661