Crime
మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య, జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నగేష్ తమ్ముడు విజయ్ పాల్ రంజిత్ కుమార్ అక్కని సోమవారం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన రంజిత్, నగేష్ ను పొడిచాడు. ఈ ఘటనలో నగేష్ చనిపోగా, అతని తండ్రి యాదగిరి, కజిన్ పోతరాజు సాయి కుమార్ కు గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రసవించింది. ఆమెను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. తల్లీ శిశువు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మైనర్ బాలికను గర్భం దాల్చింది ఎవరు అని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్యప్తులో విషయం తెలనుంది.
విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం( నేటి ) మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలసి వి ద సం అధ్యక్షుడు బూసి వెంకటరమణ జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయటకు వచ్చి ఫ్ల కార్డులతో నినాదాలు చేసారు. ఈ సంధర్భంగా బూసి వెంకటరమణ మట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఉదయం నుంచి దీక్షలో ఉన్నాడని జైలు అధికారులు ఈ సాయంత్రానికి గాని అనుమతి ఇవ్వలేమని చెప్పారని అన్నారు. అయినా శ్రీనివాస్ దీక్ష ప్రారంభించారన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉందని, కోడి కత్తి కేసులో బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్.ఐ.ఏ స్పష్టం చేసినా ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలా చేసి బయటకు రానివ్వకుండా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ బయటకు వస్తే జగన్ కు ఎన్నికల ముందు చిక్కులు తప్పవనే ఆపుతున్నారని, ఎస్సీలపై కోర్టులో ఉన్న 19 కేసులను ఇటీవల ఎత్తివేశారని శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదారత చూపించలేకపోతున్నారని అన్నారు. దళితుల పట్ల కపటి ప్రేమ చుపిస్తున్నావని జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల 23వ తేదీ మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర విజయ స్థూపం వద్ద వైయస్సార్ కు నివాళులర్పిస్తారన్నారు. అనంతరం ఆర్జె ఫంక్షన్ హాల్ లో పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారని తెలిపారు. అక్కడ నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరుతారని ఆయన తెలిపారు. వైయస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైయస్సార్ పాదయాత్ర విజయ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విజయ స్థూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జె ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
రామ జన్మభూమి అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని, టిటిడి చైర్మన్ గా ఉన్న కారణంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తరతరాలుగా కోరికగా మిగిలిన ఒక కల సాకారమై ఒక విగ్రహ రూపంలో రాముడే దివి నుంచి దిగి వచ్చినట్లు గా..మనలో మానవతా విలువలను పెంచి ప్రపంచాన్ని మార్చి మరళా రామ రాజ్యం తీసుకురావటానికి ఓ గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్లు, ప్రపంచంలో హిందువులందరినీ ఏకతాటిపై నడిపిస్తూ గొప్ప సందేశం ఇచ్చినట్టు ఉందని,బాల రామ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం మాటలలో చెప్పలేనిదని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అయోధ్యపురి శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగుతూ భక్తులంతా తన్మయంతో పూలలాడుతున్నారు. టీటీడీ ద్వార ఆహ్వానం రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అన్నారు.
నేడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ రాముల వారి ఆలయం నందు సీతాదేవి సమేత శ్రీరామచంద్ర మూర్తికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల, మేళాతాళాల నడుమ రామ నామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామి వారి ఊరేగింపు నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా కన్నులు విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాముని చిత్ర పట్టాన్ని రిక్షా పై ఉంచి ఊరోగించే తరుణంలో అక్కడున్నటువంటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు కాసేపు రిక్షా తొక్కుతూ స్వామివారికి రథసారధిగా మారారు. ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆసక్తి పరచింది…
దేశమంతటా 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు గ్రామ గ్రామాన ఎంతో ఉత్సాహభరితంగా, ఆనంద ఉల్లాసాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజాము 5 గంటల నుంచి నగర సంకీర్తన ప్రతి ఇంటి ముందు శ్రీరామ్ జయరాం రంగవల్లికలతో అలంకరించుకుని సుందరకాండ పారాయణము శ్రీరామ నామ జపము లాంటివి గోకవరంమండలంలో ప్రతి ఆలయం వద్ద చాలా భక్తితో జరిపించుకున్నారు. గోకవరం పట్టాభి రామాలయం నుంచి 40 గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాలలో వీధి వీధినా ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విక్షేంచే విధాంగా అయోధ్య లో జరిగే ప్రతి ఎల్.ఇ.డి తెరలపై చూపించారు. 10 వేలమందికి పైగా అన్న సమారాధన కార్యక్రమలు జరిగాయి.
సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రి వారికి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కోప్పవరం గ్రామం చేర్చి ఇక్కడ భూమి సస్యశ్యామలం అయిందని ఇక్కడే పనులు చేసుకుంటూ జీవించండి అంటూ బాలిక అంతర్ధానమైంది. దీనితో ఆ కుటుంబం ఆ బాలికను దేవతగా కొలుస్తూ వస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఉన్న నాటి కర్రి వారి కుటుంబం సుసంపన్నంగా వేల సంఖ్య కు చేరుకున్నారు. అంతేకాకుండా అమ్మవారు మీరు పండించిన పంటలకు కాపలా కాస్తూ వారికి అండగా నిలుస్తుంది. నాటినుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి కర్రి వారి వంశీయులు సత్తెమ్మ తల్లి ఆడపడుచును కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు మిద్దె పైన కత్తిరి కుండను కిందకు దింపడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇలా దించిన కత్తెర కుండను సంతానం లేని మహిళల తలపై ఉంచితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి మేక గొర్రె, గొర్రె పిల్లలు కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ బలి నిషేధం కావడంతో అమ్మవారికి కానుకలుగా వచ్చిన గొర్రెపిల్లలను వేలం ద్వారా విక్రయిస్తారు. రెండవ రోజున ఊరి పొలిమేరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న నాగదేవతను పూజిస్తారు. ఈ పూజ కి వెళ్లే భక్తులు రకరకాల వేషాలు ధరించి అమ్మను కొలుస్తారు. పుట్ట నుండి గుడికి వచ్చిన క్రమంలో భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండ అడ్డు కుంటారు. దీంతో కోపోద్రిక్తులైన పూజారులు భక్తులపై జకులతో దండెత్తి బడిత పూజ చేస్తారు. ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా మూడో రోజు ఆఖరి రోజైన సోమవారం జాతరలో చిత్ర విచిత్ర లతో అమ్మవార్ల జాతర్లు సాధారణంగా రాత్రి సమయాల్లో జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వెన్నెల లేకుండానే పట్టపగలు జరగడం ఓ విశేషం. అదేవిధంగా కోరికలు తీరిన భక్తులు సాధారణంగా తమకున్న సంపద నుండి కానుకలు సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం భక్తులు జాతరలో ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేయాలి ఇలా భిక్షాటన చేయగా వచ్చిన బియ్యం, నగదు కానుకలను అమ్మవారికి సమర్పించాలి. దీంతో భక్తులు రకరకాల వేషాలు ధరించి జాతరలో భిక్షాటన చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ధనిక, పేద కుల మత విభేదాలు లేకుండా ప్రతి భక్తుడు భిక్షాటన చేస్తూ ఉండడంతో గ్రామమంతా బిచ్చగాళ్ళ మయంగా మారింది. ఈ వింతను చూసేందుకు వివిధ జిల్లాల నుండి భక్తులు రావడంతో గ్రామమంతా కిటకిటలాడింది. ఇలా భిక్షాటన చేసిన వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అదేవిధంగా కొన్ని బండ్ల పై వేషాలు కూడా ఆకట్టుకున్నాయి పుష్ప సినిమా స్పూఫ్ తో భక్తులు చేసిన నటన జాతరకు హైలెట్ గా నిలిచింది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామికి పట్నం భక్తులు పబ్బతి పట్టారు మదినిండా మల్లన్న నామస్మరణతో డప్పు చప్పుల దరువు నడుమ శివశక్తుల శిగాలు పూనకాలు పోతురాజుల చిందులతో కొమురవెల్లి విజయాచాల గుట్టలు హోరెత్తాయి. మల్లన్న బ్రహ్మోత్సవాలలో భాగంగా సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. నిన్నటి రోజు మొదటి ఆదివారం కావడంతో హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు లక్ష మంది వరకు తరలివచ్చారు. కొమురవెల్లి మొత్తం జనసంద్రంగా మారింది భక్తులు భక్తి ప్రవర్తలతో బోనాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యాన్ని నివేదించారు. ఈరోజు యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం మరియు అగ్నిగుండాలు సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారం తదుపరి రోజు సోమవారం రోజున అనగా ఈరోజు హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నుంచే ఒగ్గు పూజారుల చేత పెద్ద పట్నం రచించి అలాగే అగ్నిగుండాల కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులంతా ఒంటినిండా పసుపు ధరించి భక్తులు పట్నం తొక్కి అగ్నిగుండాలలో చిందేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పెద్ద పట్నం మరియు అగ్నిగుండాలు తొక్కి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.




Total views : 90858