మరువాడ కొత్తవలస గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న భూమి మొత్తాన్ని తప్పుడు సర్వేలు చేసి రైతులను సంబంధిత అధికారులు నాన ఇబ్బంది పెడుతున్నారు. భూ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి సుమారు 9 నెలలు అయినా అప్పటి నుంచి అధికారుల వద్దకు రైతులు వెళ్లి తమ భూములకు సంబంధించిన పత్రాలు తప్పుడు సర్వేలతో ఉన్నాయని రైతులు ఎంత వాపోతున్నా సచివాలయ మరియు భూ సర్వే అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామానికి చెందిన సర్పంచ్ కోరాడ శ్రీనివాస్ కి మూడు ఎకరాలు సాగుభూమి ఉండగా అదే సర్వేతో పక్క గ్రామం అయినా ఎడ్లపాలెం గ్రామానికి చెందిన వ్యక్తికి తమ భూమి ఆన్లైన్ చేశారని సర్పంచ్ అవేదన చెందారు. అధికారుల చుట్టూ గత ఎనిమిది నెలల నుంచి తిరుగుతూ ఉన్న కనీసం భూ సర్వేలో ఇటువంటి అవకతవకలు జరిగాయి అని రైతుల వద్ద కనీసం వివరాలు కూడా సిబ్బంది తీసుకోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఎంతో మేలు జరుగుతుంది అనుకున్నామని…
కానీ ఈ సర్వే మూలంగా తమ భూములను కోల్పోయామని రైతులు వాపోయారు. మండల స్థాయి మరియు జిల్లాలో గ్రీవెన్స్ కు వినతిపత్రాలు ఇచ్చిన
ఎటువంటి ఉపయోగం లేదని తమ భూములు మళ్ళీ తమ పేరుపై ఆన్లైన్లో లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ రైతులు వేడుకుంటున్నారు.
CVr health
వరంగల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత :
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
హక్కుల కోసం పోరాటం చేయాలంటే… తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోకొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని చచ్చిపోయిన పార్టీని లేపే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో నాయకులు చేసిన భూదందా, ఇసుక మాఫియా అవినీతి చిట్టా బయట పడుతున్న తరుణంలో సమస్యను పక్కదారి పట్టించే నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా పథకాల, ప్రచారాల పేరుతో హంగు ఆర్భాటలు తప్ప ఏమి చేయలేదని ప్రజలు గమనించి తిరస్కరించారని అన్నారు. కాలేశ్వరం, అన్నారం ప్రాజెక్టులు అవినీతి మయంగా మారి నేడు కొట్టుకపోయే పరిస్థితి నెలకొందని అవినీతి బయట పడుతున్న నేపథ్యంలో పార్టీ మనగడ కష్టమవుతుందని గ్రహించిన నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బలరాం నాయక్ తీవ్రంగా ఖండించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి అనంతరం బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తామని … కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఆనాడు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపిలం కొట్లాడినం… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు పార్లమెంట్ లో మీ కేసిఆర్ లేడు అన్నారు. తల్లి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మీ బ్రతుకులు ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ముచ్చివోలు గ్రామంలో విషాదం..ఆగని మైనింగ్ మాఫియా ఆగడాలు…
మైనింగ్ మాఫియా ఆగడాలతో రెండు నిండు ప్రాణాలు బలి. నిద్రా వ్యవస్థలో అధికార యంత్రాంగం. చెరువుల్లో ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు జెసిపిలు పెట్టి చెరువు మట్టిని తవ్వేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ ముచ్చివోలు గ్రామస్తులు మండిపడుతున్నారు
శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ముచ్చివోలు గ్రామంలో విషాద ఘటన గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తెలిసిన సమాచారం ప్రకారం పశువులు మేపడానికి రోజువారీ దినచర్యలో తల్లి రామలక్ష్మమ్మ వయసు 55, కుమార్తె మునిరత్నమ్మ 26 సోమవారం ఉదయం అసలు మేపడానికి సమీపంలోని చెరువు దగ్గరికి వెళ్లడంతో గ్రామానికి చెందిన తల్లి కుమార్తె మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వారి తినుబండారాలు ఆహార పదార్థాలు చెరువు గట్టుమీద ఉండడంతో స్థానికులు గుర్తించి సమాచారం స్థానిక సచివాలయ వాలంటీర్లకు పోలీస్ సిబ్బందికి అందించిన కనీసం స్పందించలేదని గ్రామస్తులు వాయుపోయారు.
అయితే మృతి చెందిన మునరత్నమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. జీవనోపాధి కోసం గ్రామంలో పశువుల మేపుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉన్నతరణంలో మైనింగ్ మాఫియా చెరువులో ఎక్కడపడితే అక్కడ మట్టి తరలించడంతో గుంతులు లోతు ఉండలేదని తెలియడంతో చేతులు కడుక్కొని దిగడంతో తల్లి కుమార్తెలు మృతిచెందండం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
దీనిపై రూరల్ పోలీసులు వివరణ అడగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. సచివాలయ పోలీస్ వివరణ అడగ్గా పై అధికారులకు తెలిపామని వారి ఆదేశాల మేరకే కేసు నమోదు చేయడం జరుగుతుందని సచివాలయ పోలీస్ అధికారి అనూష తెలపడం విశేషం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న శ్రీశైలం పోలీసులు. క్షేత్రంలోని టోల్గేట్ సమీపంలోని ఓ మహిళ ఇంట్లో లో 166 క్వాటర్ బాటిళ్లు స్వాధీనం. పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మద్యం పట్టుకున్న పోలీసులు. మున్ననూర్ నుండి అక్రమ మద్యం తెచ్చిన మహిళ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు. క్షేత్రపరిధిలో నిబంధనలను అతిక్రమించి మద్యం, మాంసం తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: సిఐ ప్రసాదరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ (TDP Politics) : రాష్ట్రంలో టీడీపీ,జనసేన కూటమిగా ఏర్పడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి… ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వరుస భేటీలతో రాష్ట్రంలోని ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల సర్దుబాటులో బిజీగా ఉంటే… మరోపక్క రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు ఆశించే అభ్యర్థులు సీటు నాకంటే,నాకంటూ తమ బలాబలాలను చూపించుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు.. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేది నువ్వా నేనా అంటూ కూడా టీడీపీ తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారట.
TDP Politics @ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ వార్ తారాస్థాయి చేరింది. రెండు పర్యాయాలు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన వేటుకూరి శివరామరాజు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు అలియాస్ రాంబాబు మరొక అవకాశం ఇస్తే ఉండి నియోజకవర్గ నుంచి పోటీ చేసి గెలిచి తీరుతా అంటూ అధిష్టానం వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారట. దీంతో ఉండి నియోజకవర్గంలో టికెట్ మాజీ ఎమ్మెల్యే కి ఇవ్వాలో, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటుందట.
ఉండి నియోజకవర్గంలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేటుకూరి శివరామరాజు అప్పటి కాంగ్రెస్ వేవ్ లో కూడా బారి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పై పోటీ చేసి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్, టీడీపీ ప్రజా రాజ్యం పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశాయి. రాష్ట్రంలో త్రిముఖ పోటీ అప్పుడు ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన ఉండి నియోజకవర్గంలో మాత్రం టిడిపి తరఫున పోటీ చేసిన వేటికూరి శివరామరాజు విజయం సాధించారు.
శివరామరాజు ప్రతిపక్షంలో ఉన్న నాలుగు సంవత్సరాలు నిత్యం ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ అప్పట్లో రాష్ట్రమంతా తన వైపు చూసే విధంగా శివరామరాజు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి మళ్లీ శివరామరాజుకే టికెట్ ఇచ్చారు. దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నరసింహ రాజు పై శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు… ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో టీడీపీ బాస్ ఆదేశాలతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజు పోటీ చేశారు. అప్పటివరకు టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేవారు కరువయ్యారు.
ఈ నేపథ్యంలోనే శివరామరాజు తన అనుచరుడు రామరాజుని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఎంపీ సీటు తన అనుచరుడుకి ఇవ్వాలని దగ్గరుండి గెలిపించుకుంటానని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం శివరామరాజుని ఎంపీగా పోటీ చేయమని, రామరాజుని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడదామని చెప్పడంతో టిడిపి బాస్ ఆదేశాలు శిరసా వహించిన శివరామరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసారు. అప్పటి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, వైసిపి జనసేన ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది… నరసాపురం పార్లమెంటు స్థానంలో టీడీపీ తరఫున శివరామరాజు, జనసేన తరఫున సినీ నటుడు నాగబాబు, వైసీపీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన రఘు రామ కృష్ణం రాజు విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఉండి నియోజకవర్గంలో పోటీ చేసిన రామరాజు విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను చూసిన పార్టీ అధిష్టానం.. 2019లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే.. ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్ కన్ఫార్మ్ అయ్యిందని.. పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు.
నరసాపరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి తన సొంత నియోజకవర్గమైన ఉండిలో తన పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అప్పటివరకు అన్నదమ్ముల్లా ఉన్న శివరామరాజు, రామరాజులు బద్ధ శత్రువుల్లా మారారు. ప్రస్తుతం ఇరువురి మధ్య టిక్కెట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందట.
ఈసారి నేను పోటీ చేస్తా.. నువ్వు పక్కకి తప్పుకో…
ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటే నాదే అంటూ పోటీపడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 2019 ఎన్నికల్లో నేను తీసుకువచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించి మద్దతు ఇస్తేనే నువ్వు గెలిచావు. ఈసారి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా పక్కకు తప్పుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే ఫైట్ చేస్తుంటే. నాకు నియోజకవర్గంలో క్యాడర్ ఉంది ఈసారి నేను పోటీ చేసి గెలుపొందుత నాకే టిక్కెట్ కావాలంటూ టికెట్ కోసం రామరాజు మరో పక్క ఫైట్ చేస్తున్నారట. ఇప్పటికే ఇరు వర్గాలు పార్టీ బాస్ వద్ద టికెట్ కోసం పంచాయతీలు పెట్టారట. దీంతో ఎటు తేల్చలేని పార్టీ అధిష్టానం స్తబ్ధతగా ఉండిపోయిందట.
ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం టికెట్ నాకే ఇస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఇప్పటికే ధీమాగా ఉండగా, ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గం ఈ స్థాయిలోనే ధైర్యంగా ఉంది. అయితే తెలుగుదేశం నాయకత్వం మాత్రం దీనిపై స్పష్టతకు రాలేదు.
ఇప్పటికైనా అధిష్టానం మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్ ను చక్కదిద్ది. పార్టీ క్యాడర్ లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారట.
Read also : Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ
విశాఖ ( Visakha ) మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జె.డి లక్ష్మీనారాయణ.
లక్ష్మి నారాయణ కామెంట్స్ ( ఫుట్ ఓవర్ బ్రిడ్జి ) :
చంద్రంపాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి. 60 రోజుల్లో నిర్మాణం అన్నారు, నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు. సంతకాల సేకరణ తో జీవీఎంసీ కి కార్పోరేటర్ ని అడుగుతాం. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మెనిఫెస్టును విడదల చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు నిధలు ఇస్తామని 5 సంవత్సరాలకి 500 కోట్లు నిధులను ఎంఎల్ఏ కి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజా కమిటిల ద్వారా వాటిని ఖర్చు చేస్తాం.
జై భారత్ కమిటి అధికారం లోకి వస్తే 2029 లో ప్రచారం లో ఎటువంటి ప్రచారం కాని పోస్టర్స్, సభలను ఏర్పాటు చేయం. గతం లో లాగా మాకు 25 సీట్లు ఇస్తే మెడలు వంచుతాం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ సమవేశం లో బిల్ పాస్ కాకుండా చూడండి. ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తమని చెప్పండి. ఈ సారి ఎలక్షన్ లో పార్టీ కామన్ సింబల్ లేకున్న ఈవిఎం పైన అభ్యర్థి ఫోటో ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అన్న బీజేపీ పాండిచ్చేరి ఎలక్షన్ లో ఇస్తామని ఏలా చేప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీ సత్య సాయి జిల్లా (Sri Sathya Sai Dist), పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ దగ్గర్లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత (Leopard) తలపై తీవ్ర గాయాలు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఘటన. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో చిరుత దగ్గరకు వెళ్ళని వాహనదారులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వాహనదారులు.
Read also SR Nagar – ఫేక్ ఆధార్ తో అద్దె కార్లు చోరీ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్ ( SR Nagar ) లో వేరొకరి ఆధార్ గుర్తింపుతో కారు అద్దెకు తీసుకుని ఉడాయించిన ఇద్దరి పై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసిపి వై.వి. రావు కథనం ప్రకారం జహనుమకు చెందిన మహ్మద్ ఆమేర్ అలీ ఉద్యోగాన్వేషణలో భాగంగా ఓఎల్ఎక్స్ లో ఆధార్ పత్రాన్ని అప్లోడ్ చేశాడు. బండ్లగూడకు చెందిన ఉస్మాన్అలీ, అమేర్అలీ ఆ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో పేరు తన పేరుతో కలుస్తుండటంతో నిందితుల్లో ఒకరైన ఆమేర్అలీ జూమ్ కార్ లో మోహన్ రెడ్డి అనే యజమాని నుంచి కారు అద్దెకు తీసుకుని కనిపించకుండా పోయాడు. ఇటీవల కారు యజమాని మోహన్ రెడ్డి ఎస్సార్ నగర్ సమీపంలో నిందితుడిని చూసి వెంబడించాడు. దీంతో కారుతో వేగంగా దూసుకెళ్లిన ఆమేర్ అలీ పంజాగుట్ట ప్రాంతంలో కొందరిని ఢీకొట్టాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. ఈ కేసులో, తన ఆధార్‌తోనే కారు అద్దెకు తీసుకుని చోరీ చేశారని బాధితుడైన మహ్మద్ ఆమెర్ అలీ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఆమేర్అలీ, ఉస్మాన్అలీ లపై కేసు నమోదు చేశారు. వీరు మరి కొన్నిచోట్ల ఇలాగే కార్లు చోరీ చేసినట్లు తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 89981