ఈ పుణ్యభూమిలో భగవంతుని ఎదోఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది. అయితే అన్ని విధాలైన పూజలలో శక్త్యారాధాన జరుగుతుంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. చిత్ ప్రధానమైనది బ్రహ్మవిద్య. శక్తి ప్రధానమైనది శ్రీవిద్య. ఈ రెంటికీ భేదం లేదు. ఈ జగత్తు సృష్టి స్థితిలయలను కలిగించే బ్రహ్మమే శక్తి. ఆమె శ్రీమాత. జగజ్జనని. మూలప్రకృతి. మహామాయ. పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపించిన శక్తి ఆమె. పరతత్వానికి స్త్రీ పురుష బేధం లేదు. అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపురసుందరిగా పూజలందుకుంటొంది. ఆ తల్లి ఆవిర్భావాన్ని బ్రహ్మాండాపురాణంలోని లలితాపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం. అందులో హాయగ్రీవుడు శ్రీమాత ప్రాదుర్భావాన్ని, ప్రాభవాన్ని సవివరంగా చెబుతాడు. అనంతరం అగస్త్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతాడు. అదే శ్రీలలితా సహస్రం. లోకోత్తర లావణ్య భావంతో, చిన్మయ చైతన్యంతో, అణువు అణువులో ఆడిపాడి ఓలలాడే లీలావతి లితాపరమేశ్వరీదేవి. సమస్తలోక కల్యాణమే ఆమె లక్ష్యం. ఆమె హృదయంలో కరుణా సముద్రం పొంగిపొరలుతుంటుంది. చతుష్పష్టి కళలలో ఆమె ఆరితేరిన కళానిధి. ఆమె మృదుమధుర పలుకులలో సకల కళలు ఉట్టిపడుతుంటాయి. భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారలంటే ఆ తల్లికి అమితమైన ఇష్టం. తన చల్లని చూపులతో ఈ సమస్తలోకాలను అనుగ్రహిస్తోంది. ఈ లోకంలో ఆమెను మించిన మంచితనాన్ని మనం ఎక్కడా చూడలేం. సహస్రారం చేరేందుకు దారి చూపే వారుణీనాడి ఆమె చేతిలొ ఉంది. అందుకే ఆమె అనుగ్రహం లభించిన వారికి తెలుసుకోవలసింది అంతా పూర్తిగా తెలిసిపోతుంది. ఆమె మానస సరోవరంలో మందగమనంతో సంచరించే రాజహంసలా తన భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది. మంత్రరూపంలో గోచరించే ఆ తల్లిని ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు. హృదయం, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, కవచం, ఆస్త్రం – ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం. ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ఉంటుంది. సాంగంగా, పరమేశ్వరిని ఆరాధించినవాళ్ళకు కీర్తిప్రతిష్టలు, సంపదలు, సమృద్ధి, ప్రజ్ఞ, వైరాగ్యం, ధర్మం అనే ఆరు గుణాలు అలవడుతాయి. ఆ పరమేశ్వరి తత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు చతుర్వింశతి (24) తత్వాలే సోపానాలు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) పంచ తన్మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం గంధం) పంచేంద్రియాల జంటలు (కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు) మనస్సు, బుద్ధి, అహంకారం, మహత్తు, వీటిద్వారా ఆ తల్లిని తెలుసుకోవాలి. వీటిలో, వీటికి అతీతంగా ఉండే పర్మేశ్వరి తత్త్వాసన, తత్త్వ సింహాసనంపై ఆసీనురాలైన తత్వాసనిని చూడగలిగిన తాత్వికుడు, ఆ తల్లికి తన అంతరంగాన్ని చెప్పుకుంటాడు. ప్రపంచంలో ప్రతి పదార్థంలో ఎదో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మూలం పరాశక్తి. పరమేశ్వరిలోని అపరిమేయమైన పరాశక్తి అన్ని పదార్థాలలో వేర్వేరుగా ప్రతిఫలిస్తుంటుంది. ఆమెను మించిన శక్తిలేదు. శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవలసి ఉంటుంది. అందుకు అచంచలమైన దీక్ష కావాలి. ఉత్కృష్టమైన నిష్ట కావాలి. ఆమె శక్తికే కాదు, జ్ఞానానికి కూడ పరాకాష్ఠ. ఈ సమస్త విశ్వంలోని ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్తదశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి. ఆ పరావాక్కే పరాశక్తి. ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపంలో ప్రవహిస్తుంది. అనంతమైన జ్ఞానం అమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె జ్ఞానానందంలో తేలిపోతుంటుంది. ఆమె పేరు చెబితేనే మాంగల్యం ఫలిస్తుంది. మంగళ ధ్వనులు వినిపిస్తాయి. ఆమెను దర్శించుకున్న ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. ఆమె చరిత్రను తెలుసుకున్నవారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. ఆమె సాయుజ్యమే అఖండమైన సామ్రాజ్యం. ఆ తల్లి కటాక్షవీక్షణం ప్రసరిస్తేచాలు, సమస్త ఐశ్వర్యాలు మన ముందుకొచ్చి పడతాయి. అన్యులను కూడ ధన్యులను చేసే కరుణామయి. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కారుణ్యమూర్తి ఆ తల్లి. ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్తశుభాలు కలుగుతాయి అన్ని విధాలైన కష్టాలు తొలగిపోతాయి.
devotional news
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలివేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.
అనేక శివలింగములు ప్రతిష్ఠించి పుష్పక మెక్కి గౌతమి పశ్చిమ తటక మునకు వచ్చు సరికి పుష్పకము కదలలేదు. ఇందు క్షేత్రవిశేషము కలదని పరిశోధించగా ఒక పుట్ట కనబడెను. దానిని ఛేదించి అందు తపము ఆచరించుచున్న స్త్రీని చూచి, నీవు ఎవరవు అని అడుగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధముగా వివరించెను. ఉత్కళ దేశమందు ఓడ్ర పుండ్రకమను పేరుగల నగరములో సోమశర్మ అను ముని ఉండెను. అతని కుమారుడు జయభద్రుడు. నేను అతని భార్యను నా పేరు శ్రమణి. నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా పతి స్నానార్ధమై వెళ్ళిన తరువాత నా పతిరూపములో వచ్చి కామలీలయందు ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో నున్న గంధర్వుని భస్మము చేసేను. కృతాంజలిగా నున్న నన్ను చూచి నీవు ఛండాల స్త్రీగా అగుమని శపించెను. శాపగ్రస్తురాలలైన నేను మామగారి వద్ద మొర పెట్టుకొనగా, వారు దివ్యదృష్టి జరిగినది తెలుసుకొని గౌతమి నదిలో స్నానమాత్రముచే పాప పరిహారమగును. శివశివయని ఘోర తపము చేయుటవలన త్రేతాయుగములో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యముచే నీవు ముక్తిని పొందగలనని చెప్పి వెళ్లిరి. అది మొదలు ఇప్పటివరకు తపము చేయుచుండె నని చెప్పెను. అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్ధించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగనము చేసుకొనేను అంతట శ్రీ రాముడు ఈశ్వరా ! ఈ శ్రమణికి ముక్తిని ప్రసాదించమనియు, ముక్తి ఇమ్మని సర్వజనులు నిన్ను చూచిన క్షణకాలములో ముక్తినొందు వరము ప్రసాదించమని ప్రార్థించి, ఒక శివలింగము ప్రతిష్ఠించెను. అందువలన ఈ క్షేత్రము క్షణ ముక్తేశ్వర క్షేత్రముగా వెలుగొందుచున్నది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో నరక చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో తిరువీధి నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మధ్యరంగం మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరకాసుర ప్రతిమను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఆలయ ఈవో గొలమరి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు, కమిటీ సభ్యులు, ఉభయ దాతలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం. కనీవినీ ఎరిగిన రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు. ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని సేవకు అంకితమైన చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్రగా బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ రూరల్ లోని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందని కలిచారు. వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీనివాస శాస్త్రి శ్రీరాముల వారి పాదుకలు తయారు చేయించారు. వాటితో పాదయాత్రగా వెళ్తున్నారు. గతంలో శ్రీరామచంద్రుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. ప్రస్తుతం ఆయన పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్తున్నాయి అంటూ స్వామీజీ అభివర్ణించారు. పాదుకలకు ప్రత్యేక పూజలు చేసారు. ఆయన స్వహస్తాల మీదుగా పూజలు చేసి శ్రీనివాస శాస్త్రికి అందజేశారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
చిత్తూరు జిల్లా పుంగనూరు.. చౌడేపల్లి( మం) దిగువ పల్లి (పం) కి చేరిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో బుధవారం నాడు 56 రోజుల కు హుండీ లెక్కింపు.. ఈ క్రమం లో అమ్మవారికి భక్తులు చెల్లించిన కానుకలు వివరాలు.. నగదు..రూ.80 65 652 /- బంగారు..85 గ్రా.లు వెండి……830 గ్రా.లు కె
కువైట్…6 దినార్లు. (1 దినార్లు) అలాగే ఆలయం అనుబందంగా ఉన్న రణ భేరి గంగమ్మ అమ్మవారి కి భక్త్తులు సమర్పించిన కానుకలు.. నగదు..రూ.62 140/–లు గా ఆదాయం వచ్చిందని ఆలయ చైర్మన్ ..నాగరాజ రెడ్డి..కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి లు తెలిపారు.





Total views : 90520