కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో శోభాయమానంగా మారింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉన్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా దేవస్థానం అర్చకులు కృష్ణవేణి నదీమతల్లికి కర్పూర హారతులు ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం జరగనున్నది. ఈ ఉత్సవంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా పాల్గొననున్నారు.
Devotional#
వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రమున్నది అంటారు. ఆ క్షేత్రాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ, వింధ్య పర్వతము మీదికి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురువెళ్ళి స్వాగత సత్కారాలందించి. ఉచిత రీతిన గౌరవించాడు. వారి ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇష్టాగోష్టి జరుగుతోంది. ఆ సమయంలో వింధ్యరాజు “నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు. మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాక ఇంకెవరు ఉంటారు?” అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. నారదుడు తనని మెచ్చుకోకుండా అలా నిట్టూర్పు విడిచేసరికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షి నిట్టూర్పుకు కారణము ఏమిటి? పర్వతాలలో సార్వభౌముడు తను కాదా? అని ఈ రకంగా ఆలోచిస్తూ “మహర్షీ నేను అలా అనగానే ఇలా నిట్టూర్పు విడుస్తున్నారు ఎందుకు?? మీరు అలా నిట్టూర్చడం వెనుక అర్థం ఏమిటి?” అన్నాడు. దానికి నారదుడు “వింధ్యరాజా! నువ్వు చెప్పినదంతా నిజమే. నీ దగ్గర సర్వసంపదలు ఉన్నాయి, సమస్త ధాతువులు ఉన్నాయి, బంగారము మొదలుగా గల లోహాలు అన్నీ ఉన్న మాట నిజమే. కాని మేరుపర్వత శిఖరాల గురించి తెలియదా?? ఆ శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. మరి వారందరూ నీదగ్గరకు వస్తున్నారా?? నీకా భాగ్యము లేదు. అందుకే నాకు విచారము. నా నిట్టూర్పుకు కారణం అదే” అన్నాడు. మేరు పర్వతము కన్న గొప్ప అనిపించుకోవాలనే పట్టుదల వింధ్య పర్వతానికి కలిగింది. దానికోసం ఆ పరమేశ్వరుని ఆరాధించటము తప్ప మరే మార్గం లేదు అని నిశ్చయించి తపస్సు చెయ్యటానికి ఓంకార యంత్రము ఒకటి తయారుచేసి, దాని మీద పార్ధివ లింగము స్థాపించి సంకల్పించాడు. ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి. ప్రత్యక్షమై ‘ఏ వరం కావాలో కోరుకో!’ అన్నాడు. “పరమేశ్వరా! చంద్రమౌళీశ్వరా! పాహిమాం తండ్రీ! పాహిమాం! నీ కరుణ లేశమాత్రము ఉన్నప్పటికీ, నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు. నాకు ఇంక కావలసినది ఏమున్నది. అయినప్పటికి నాదొక చిన్న ప్రార్ధన. మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా, దేవతలు విహరించటానికి వీలుగా ఉండటము నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి. అటువంటి నువ్వు, నా శిఖరాన సదా నివసించవలసినదిగా నా ప్రార్ధన” అన్నాడు వింధ్యరాజు. ఆ పలుకులు ఆలకించిన శంకరుడు, భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు.. ఇప్పుడు ఓంకార యంత్రము, పార్థివ లింగము రెండుగా అయిపోయినాయి. ఓంకార యంత్రమందు ఉద్భవించినవాడు కాబట్టి ఓంకారేశ్వరుడు, పార్ధివ లింగమందు ఉద్భవించినవాడు కాబట్టి అమలేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ నర్మదానది కూడా రెండు పాయలుగా చీలిపోయింది. ఆ రెండు పాయల నడుము ఒక శిఖరమున్నది. ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి, విష్ణువురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి. ఇదీ ఓంకారేశ్వరుడి కథ.
కార్తీకమాసంలో పితృకర్మలు ఎక్కువగా చేస్తారు. అలాంటి పితృదేవతలకు మోక్షాన్ని చేకూర్చే ఆలయం ఆ పరమశివుడి ద్వారా ఎంతో విచిత్రంగా పురుడుపోసుకుంది. శివ పార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు , బ్రహ్మ పంచముఖుడు, అంటే ఆయనకు అయిదు ముఖాలు ఉన్నాయి. అయితే నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కాని, ఆయన ఊర్ద్వముఖం పార్వతీదేవి అందాన్ని చూస్తూ ఉండిపోయింది. అది గ్రహించిన పరమ శివునికి ఆగ్రహం వచ్చింది, బ్రహ్మకు బుద్ది చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేసాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సామాన్యమైనది కాదు. దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కాని అది కింద పడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా అది ఆయన చేయిని వదలలేదు, క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ తప్పు చేశాడు, దానికి శివుడు శిక్ష విధించాల్సి వచ్చింది అయితే అది సరాసరి బ్రహ్మ హత్యా పాతకంగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగత్ప్రభువు, అంతటి తపశ్శాలికి ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరిని పిలిచి నిస్సంకోచంగా జరిగినదంతా వారికి చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటొ సూచించమని పరమశివుడు అడిగాడు. అప్పుడు అందరూ “పరమేశ్వరా నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి, శాసించగలిగినవాడివి, అయినా మా మీద కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు కనుక మాకు తోచింది చెపుతున్నాము. ఈ కపాలాన్నే భిక్షాపాత్రగా భావించి. ఇంటింటికీ తిరుగుతూ ప్రతీచోటా నీ పాపం చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు కొంత కాలానికి ఆ కపాలం నీ చేతి నుండి రాలిపోవచ్చు అని చెప్పారు దేవతలు. పరమశివుడికి ఇది బాగానే ఉందని అనిపించింది. భిక్షువుగా మారి మూడు లోకాలు తిరుగుతూ మళ్ళీ తన పెళ్లి జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాలలో తాను పూర్వం కేదారేశ్వరుడుగా అవతరించి ఉన్నాడు. అందుకు సంతోషించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాలలోని శిఖరాలను, నదులను శివుడికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడివద్దకు వచ్చి “పరమశివా నీ అధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా!ఈ బదరీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు బహుమతిగా ఇవ్వవా అని అడిగాడట. నారాయణుడు అంతటివాడు అడిగితే శివుడు తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు. పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు, అప్పటినుండి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు ఆ తరువాత శివుడు ఆయనదగ్గరకే భిక్షకు బయలుదెరాడు. ఆ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు,”పరమ శివుడే నాదగ్గరికి భిక్షకి వస్తున్నాడు. నిజానికి ఇది ఆయన ఇల్లే, తన ఇంటికే ఆయన భిక్షకు వస్తున్నాడు. అంటే అది ఆ మహా యోగి వైరాగ్యానికి పరాకాష్ట, ఈ అద్భుత సన్నివేశాన్ని జగత్విదితం చేయాలి, ఇది వాస్తవానికి శివక్షేత్రం, ఇందులో నేను( విష్ణువు) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మకపాలంను పట్టుకుని వస్తున్నాడు. చిరకాల శివ హస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భావనలు అన్ని నశించిపోయాయి. ఇప్పుడది పరమపవిత్రం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికితోడు విష్ణు శక్తి, శివ శక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని” భావిస్తు విష్ణువు శివుడికి ఎదురువెళ్లి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు, అంతే ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడిపోయి శిలామయ (రాతి) శివలింగరూపంగా మారిపోయింది. అప్పటినుండి బదరీనారాయణుడి సన్నిధిలో ఉన్న శివలింగరూపధారి అయిన బ్రహ్మకపాలం మహా క్షేత్రమైంది. తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గం అయ్యింది.
Read Also..
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ధన త్రయోదశి పండుగను ప్రజలు జరుపుకుంటారు. ఈ మాసం విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడిందని చాలా మందికి తెలుసు. అందుకే ఈ మాసంలో తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ పరిహారాలు చేయాలి. మరి ఇందుకోసం ధన త్రయోదశి రోజు తులసికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. అందుకే ధన త్రయోదశి రోజు తులసి ఆకుల రసాన్ని తాగడం శుభప్రదంగా భావిస్తారు. ఇది మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా మీకు సంపదను కూడా తెచ్చిపెడుతుంది. అలాగే జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది మీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్కను పెట్టాలి. అలాగే మరిచిపోకుండా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇంకా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు మాత్రమే ఇలా చేయాలని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత రాత్రి కాకముందే తులసి మొక్కను తిరిగి ఇంట్లో పెట్టాలి. దీని వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు తులసి మొక్కకు సంబంధించిన ఈ పనులు చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజు ఇంటికి జమ్మి మొక్కను తీసుకురావడాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు. ఇలా జమ్మి మొక్కను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.
Read Also..
Read Also..
నవంబరు 24, 2023 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు ఆచరించాల్సిన వ్రతం, పూజావిధానం, శ్లోకాలను ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. చిలకమర్తి పంచాంగరీత్యా ధక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 24 నవంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కార్తీక మాసం శుక్రవారం శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుందని, క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం శుక్రవారం సాయంత్రం చేసుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ద్వారా క్షీరాబ్టి ద్వాదశి వ్రత విధానమును పాఠకులకు చిలకమర్తి తెలియచేశారు.
తులసి మొక్క ఇంట్లోకి పాజిటివ్ శక్తిని ప్రసరిస్తుంది. ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది. తీర్థయాత్రలకు సమానమైన ఫలితాలను పొందుతాడు. మన గ్రంథాలలో తులసి అందం, ఆనందం, అభివృద్దికి చిహ్నంగా చెప్పారు. తులసి మొక్క ఉంటే ఇంట్లో గొడవలు జరగవు. ఆనందం, అభివృద్ది ఉంటాయి. ఇంట్లో తులసి మొక్కను ఈశాన్య మూలలో నాటాలి. ఇది చాలా శుభప్రదంగా చెబుతారు. ఇది ఇంటి పరిస్థితిని మెరుగుపరుస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. తులసి మొక్క ఈశాన్య దిశలో ఉండడం వల్ల శక్తిని ఆకర్షించగలదు. ప్రతిరోజూ తులసికి ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ శక్తి వస్తుంది. మానవ సంబంధాలు బలపడతాయి. నిద్రలేచిన వెంటనే తులసిని చూడటం శుభప్రదంగా చెబుతారు. అన్ని ముఖ్యంగా ధనుస్సు, కర్కాటకం, వృషభ రాశుల వారికి ఈ మొక్క చాలా శుభప్రదమైనది. వారి జీవితంలో విజయాన్ని అందిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో తులసి ఆకులను విలువైనవిగా పరిగణిస్తారు. తులసిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం మెరుగుపడుతాయి. తులసి మహిమ ఎంతగా ఉంటుందంటే దాని వినియోగం పాపాలను పోగొట్టడంలో సహాయపడతాయి. వ్యక్తిని బలంగా చేస్తాయి. జ్యోతిష్యం, వాస్తు రెండింటిలోనూ తులసికి ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని ఇంట్లో సరైన ప్రదేశంలో నాటడం వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని సంపన్నమైనదిగా మార్చుకోవచ్చు.
Read Also..
విజయవాడ నగరంలోని శివక్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయంగా కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ప్రసిద్ధి. 105 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎందరో భక్తులు కాశీ విశ్వేశ్వరుని అన్నపూర్ణను దర్శించుకొని సేవించారు. అప్పన్న వెంకట కృష్ణయ్య, అద్దెపల్లి వెంకటప్పయ్య అనే ఇద్దరు శివ భక్తులు శివ నామస్మరణతో ఆధ్యాత్మిక జీవనం చేస్తుండేవారు. ఈశ్వరుని సేవించికునేందుకు పరమ పవిత్ర క్షేత్రం అయిన కాశీకి వెళ్లారు. అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు గంగానది తీరంలో స్నానం ఆచరిస్తుండగా వీరు మునిగి పైకి తేలిన వెంటనే వారి చేతిలో శివలింగాలు దోసిళ్లలోకి వచ్చాయి. వీరు వీటిని పవిత్రంగా ఈశ్వరుని ఆదేశంగా భావించి నగరానికి వచ్చి చల్లపల్లి బంగ్లా వద్ద గల ప్రదేశంలో 1909 మార్చి 3వ తేదీన శుద్ద ఏకాదశి బుధవారం నాడు వీటిని ప్రతిష్టించారు. అప్పటినుండి ఆధ్యాత్మికతో కూడిన భక్తి కార్యక్రమాలతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. కొంత కాలానికి అక్కడ దేవాలయాన్ని నిర్మించి వారి వంశీకులు స్వామివారిని ఆరాధిస్తూ, అభిషేకిస్తూ గడిపారు. భక్తులు కూడా స్వామి వారిని కొలుస్తూ తమ మనోభిష్టాన్ని నెరవేర్చాలని కోరుతూ స్వామి అనుగ్రహం పొందేందుకు పూజాదికాలు విశేషంగా జరుపుతారు. మహాకుంభాభిషేకం, సహస్ర శంకాభిషేకం, రుద్ర యాగం , చండీ పారాయణం, మహా యజ్ఞాది క్రతువులు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి కరమైన ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు. ప్రతి నిత్యం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 100 సంవత్సరాలనుండే దేవాలయాన్ని సుందరంగా అలంకరించి భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పనకు శ్రద్ధ తీసుకున్నారు. దేవస్థాన ధర్మ కర్తలు అయిన అప్పన సూర్యనారాయణ,మోహనరావు,వెంకట సత్యనారాయణలు ఈ విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవాలయం చుట్టూ ఉన్న గోడలపై స్వామి వారి ప్రతిమలను వివిధ రూపాలలో పెయింటింగ్ లు చేయించారు. దేవస్థానం ఆవరణలో ఫ్లోరింగ్ జనరేటర్ నిత్య ప్రసాదాలు, విశేష పూజా కార్యక్రమాలు, ధర్మ కర్తల సహాయంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆవరణలో ఉన్న కోటి లింగాల చెట్టు పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పువ్వులు పరమ శివునికే అర్పితం. ఫిబ్రవరి లో లక్ష రుద్రాక్షల పూజ, రుద్ర యాగం, సర్వ దేవతల హోమాలు జరుగుతాయి. ప్రతి షష్టికి సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అభిషేకాలుహోమాలు జరుగుతాయి. విశేష పవిత్ర దినాల్లో కార్తీక మాసం, శివరాత్రిలో శరన్నవారాత్రులలో అమ్మవారికి త్రికాల పూజలు ,మహా మంత్రం అనుష్టానం, అభిషేకాలు, నిత్య అభిషేక వితరణలు జరుగుతాయి. ప్రతి నిత్యం లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం ఇక్కడ జరుగుతాయి. భక్తులంతా దర్శించుకొని ఆ కాశీ అన్నపూర్ణ ఆశీర్వాదం అనుగ్రహం పొందగలరు.
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసం శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది. కార్తీక మాసానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధనను చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో శివునికి రుద్రాభిషేకం, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతారు. కార్తీక మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలను ఆచరించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. కార్తీక ఏకాదశి, కార్తీక ద్వాదశి, కార్తీక శుక్ల పౌర్ణమి, కార్తీక చతుర్దశి, కార్తీక మాసంలో శివుని పేరుతో ఏదైనా వ్రతం చేయడం. కార్తీక మాసం అనేది భక్తి, శ్రద్ధ, పుణ్యకార్యాలు కోసం అత్యంత అనుకూలమైన సమయం. ఈ మాసంలో భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి, శివుని అనుగ్రహం పొందడానికి, తమ కోరికలను నెరవేర్చుకోవడానికి వివిధ రకాల వ్రతాలు, పూజలు, ధర్మకార్యాలు చేస్తారు.
Read Also..
Read Also..
పూర్వం లో అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు. యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు. కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు. అందరు బంధువులే కావలసిన వారే వీళ్ళందర్నీ చంపి ,తాను రక్తపు కూడు తినాల్సి వస్తుంది అని బాధ పడ్డాడు. కనుక యుద్ధం చేయటం కంటే భిక్షం ఎత్తు కొని హాయిగా జీవించ వచ్చు అని పించింది పాండవ మధ్యముడికి. మనసు అంతా వ్యాకులం అయింది. కర్తవ్యమ్ తోచటం లేడు శ్రీ కృష్ణ పరమాత్మ నే శరణు కోరి కర్తవ్యమ్ బోధించమని వేడు కొన్నాడు. బావ మరిది ఈ యుద్ధ ఫలాన్ని అన్న గారైన యుదిష్టిరునికి కానుక గా ఇవ్వ వల్సిన వాడు అర్జునుని మనో భావం గుర్తిన్చాడు శ్ర కృష్ణ భగవాన్. వెంటనే పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతా సారాన్ని విని పించి యుద్దోన్ముఖుడిని చేశాడు. భగవానుని గీత ను అను సరించి ,విషాదాన్ని త్యజించి యుద్ధం చేశాడు పార్ధుడు. పార్దునికి ,పార్ధ సారధి విని పిస్తున్న భగవద్ గీత నంతటిని అర్జునుని రధాపు జెండా పై కొలువై కూర్చున్న మారుతి శ్రద్ధగా విన్నాడు. మనసుకు దాన్ని అంతటిని పట్టించు కొన్నాడు. ”శ్రీ కృష్ణా ! నీ గీతా సారం విని ధన్యుడనయాను మహాత్మా !”అని భక్తీ తో నమస్కరించాడు .అప్పుడు గోపాల చక్ర వర్తి శ్రీ కృష్ణ పరమాత్మ ”హను మంతా !నేను చెప్పిన విషయాలను నా అనుమతి లేకుండా నువ్వు విన్నావు. దానికి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న గీత కు ”భాష్యం ”రచించు. దానితో నీ పిశాచ రూపం అంత రిస్తుంది ”అని శాపాన్ని ,శాప విమోచనాన్ని తెలియ జేశాడు పరమాత్మ. కురు క్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత,హనుమ పిశాచి రూపం పొంది ,గంధ మాదన పర్వతం చేరాడు. అక్కడ అత్యంత భక్తీ ,శ్రద్ధ లతో భగవద్ గీతను మననం చేసు కొంటూ ”,గీతా భాష్యం ”రచించాడు .అదే హనుమద్ భాష్యం ”గా లోకం లో ప్రసిద్ధి చెందింది. అక్కడక్కడ ఈ భాష్య గ్రంధాలు కనీ పిస్తున్నాయట. ఈ కదా విశేషా లన్నిటిని మైత్రేయాది మహర్షులకు పరాశర మహర్షి చెప్పి” శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని”సంపూర్ణం గా తెలియ జేశాడు. ఆ మర్నాడు మైత్రేయాది మహర్షులు ,పరాశర మహర్షి ఇత్యాది శిష్య బృందం అందరు కలిసి శ్రీ హనుమ పూజ ను నిర్వహించి ,నైవేద్యం పెట్టి అందరికి తీర్ధ ,ప్రసాదాలను అంద జేశారు .ఎక్కడ హనుమ పూజ జరుగు తుందో అక్కడ శ్రీ రాముడు సీతా ఆంజనేయ సమేతం గా లక్ష్మణ భరత శత్రుఘ్నపరి వారంతో ,ఉమా మహేశ్వరు లతో కొలువై ఉండి అందరకు మనో భీష్టా లను నేర వేరుస్తాడు.
Read Also..
Read Also..
కార్తీకం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఇది తెలుగు మాసాలలో ఎనిమిదవ మాసం. ఈ మాసం శివునికి చాలా ప్రీతిపాత్రమైనది. కార్తీకం మాసంలో, భక్తులు శివుని ఆరాధనలో తమను మునిగిపోయేలా చేస్తారు. వారు ప్రతిరోజూ ఉపవాసం చేస్తారు, శివాలయాలను సందర్శిస్తారు మరియు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో చాలా పండుగలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజున, భక్తులు శివుని ఆరాధనలో పాల్గొంటారు మరియు దీపాలను వెలిగిస్తారు. కార్తీక ఏకాదశి కూడా ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున, భక్తులు విష్ణువును ఆరాధిస్తారు మరియు ఉపవాసం చేస్తారు. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం హిందువులు శివుని ఆరాధన చేస్తారు. ఈ రోజున, భక్తులు శివాలయాలను సందర్శిస్తారు మరియు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రత్యేకమైన సమయం. ఈ మాసంలో, భక్తులు తమ ఆధ్యాత్మికతను మెరుగుపరచడానికి మరియు శివుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు.




Total views : 90653