ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ(Election Campaign Meeting)లో రాహుల్(Rahul) పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలను బ్యాంకు ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జనాభాకు తగినట్టుగా అందరికీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. అదే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు.
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.