సనత్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మైనార్టీ సోదరులు ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ అవసరం వచ్చిన శుభకార్యానికి అండగా నిలిచే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని 450 కోట్లతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలిపారని వారు అన్నారు. మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని కుల, మతవరణలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే తెల్ల బట్టలు వేసుకొని కనబడే వ్యక్తులు ప్రజలలో ఎప్పటికీ ఉండాలని స్థానిక ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు లేకనే ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై కేసీఆర్ పై నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరిలో ప్రవహించే రక్తం పోరాటాల స్ఫూర్తితో ఉంటుందని వారు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయే ప్రజలు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని ఎన్ని ప్రలోభాలుకు గురిచేసిన భయపెట్టిన భయపడే వాళ్ళు ఎవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు కాని వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, ఇక్కడి మనిషైనా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి పార్టీ అభ్యర్థి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేడని వారితో నాకు పోటీ ఏంటి అని ఎద్దేవా చేశారు. కచ్చితంగా సనత్ నగర్ నియోజకవర్గం లో లక్ష మెజార్టీతో తన గెలుపు ఖాయమని అన్నారు.
Election Campaign
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.
18 వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమ సమాచారం తెలుసుకొని భవిష్యత్తు మీద భరోసా కనిపిస్తూ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 73 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని చాలా అమానుషం అంటూ ఒక కేసులో కూడా కనీసం ప్రాథమిక సాక్షాదారాలను కూడా కోర్టుకి సబ్మిట్ చెయ్యలేకపోయారని దీన్నిబట్టి ఇది అక్రమ కేసు అని నిర్ధారణ అయిందని హైకోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందని ఇంతటి దుర్మార్గం అరాచకం అన్యాయాలను ప్రజలందరూ గమనించాలని త్వరలోనే వీరికి బుద్ధి చెప్పటం ఖాయం అని తెలియజేశారు. ఇక వైసిపి నాయకులు మార్కాపురం లో తెలుగుదేశం నాయకులను మరియు ప్రజలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెబుతున్నారని వీరి తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడ వద్దని నిర్భయంగా తమ దృష్టికి తేవాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్కాపురం లో ఒక కుటుంబం కూడా వైసిపికి ఓటు వేయొద్దని ఒకవేళ ఓటు వేస్తే వైసిపి నాయకుల అన్యాయాలను అరాచకాలను ఆక్రమణలను సమర్ధించినట్టేనని తెలియజేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చలమల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మునుగోడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఇక్కడ యువకులలో నూతన జోష్ కనిపిస్తుందన్నారు. ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు మునుగోడు లో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. నూతన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్‌కు చేరుకోని అక్కడ నిర్వహించే ప్రచార సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్లి అక్కడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో వేములవాడకు బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు.
విద్యార్థులకు ఉచిత విద్య అందించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది చింతకుంట విజయ రమణ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మండలం లో హనుమంతంపేట, రాంపల్లి, మారేడుగొండ, జగన్నాధపురం, వెంకట్రావుపల్లి, గుర్రంపల్లి గ్రామం లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను వివరించి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించమని కోరిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణ రావు అభ్యర్థించారు.
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది. కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also..
అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సచివాలయం నెం 8 పరిధిలో వార్డు నెం 15 లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ శాసన సభ్యులు శ్రీ Y.వెంకటరామి రెడ్డి గారు హాజరైయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వెంకటరామి రెడ్డి గారు వార్డులో పర్యటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినారు. అంతే కాకుండా రాష్ట్రములో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత మన జగనన్నకే దక్కుతుందని, మన కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడుకి మనమందరం అండగా నిలబడి జగనన్నను 2024 కూడా మరల ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు. అలాగే అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని వారికి కూడా వీలైంత త్వరగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సైదాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోకు విశేష స్పందన వస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇతర పార్టీ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షలతో పాటు తులం బంగారం ఇల్లు లేని పేదలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సాయం, ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందించనున్నామని వివరించారు. సాగుకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంటల భీమా ఇస్తామని వెల్లడించారు. ఎస్సీ కుటుంబాలకు 12 లక్షల వరకు ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలు కేటాయించినున్నట్లు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగల భర్తీ ఎస్టీ కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షలు ఆర్థిక సాయం ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల పెంపు ప్రతి విద్యార్ధికి ఐదు లక్షల విద్య భరోసా కార్డు బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ వర్తింపు స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో 10 లక్షల ఋణం అందిస్తామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల సాయం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఆరోగ్య భీమా, ఇంటి స్థలాలు తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఆరు నెలల్లో మెగా డీఎస్సీ అమలు చేస్తామని తెలిపారు.
Read Also..
పరకాల పట్టణ శివారులో కాకతీయ థియేటర్ ఎదురుగ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు రానున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పై చిలుకు జనాలు రానున్నారని అంచనా వేస్తున్నారు. లలిత కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో హెలిపాడ్ ల్యాండ్ అయిన తరువాత కాన్వాయ్ లో రోడ్ షో ద్వారా సభాస్థలికి చేరుకొనున్నారు.





Total views : 90794