హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళిప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో భాగంగా బైక్ పై వస్తున్న యువకున్ని అడ్డుకుని ఆకారణంగా ఆ యువకున్ని CRPF పోలీస్ కానిస్టేబుల్లు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకు పోయి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం CI వెంకట రత్నం చొరవతో యువకున్ని విడుదల చేయడంతో గొడవ సర్దుమనిగింది..
election
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ఈ రోజు నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా, సాదాసీదా గా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో కు సమర్పించారు.
Read Also..
సికింద్రాబాద్ లో బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి. బండపల్లి సతీష్ గౌడ్ .సికింద్రాబాద్ నియోజకవర్గము బిజెపి నాయకుడు బండపల్లి సతీష్ గౌడ్ బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు. సికింద్రాబాద్ లో బిజెపి పార్టీకి గత 10 సంవత్సరాల నుండి కష్టపడి పని చేశాను. గత ఎలక్షన్ లో సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పద్మారావు గౌడ్ పై ఓడిపోయాను. గడిచిన పదేళ్లలో సికింద్రాబాద్ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు చేస్తున్నాన న్నారు. సికింద్రాబాద్ లో బూతు స్థాయి కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. కష్టపడి పనిచేసిన వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదన్నారు.ఎన్నోసార్లు ఫోన్ చేసిన ఇప్పటివరకు ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం కూడ ఇవ్వలేదన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గం సర్వేలో మొదటి వరుసలో నా పేరు ఉందని అన్నారు. సర్వేలో జీరో స్థానంలో ఉన్న మేకల సారంగపానికి టికెట్ ఎలా ఇస్తారన్నారు. ఇప్పుడు కూడ బిజెపి పార్టీ సిద్ధాంతాలతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ సికింద్రాబాద్ నుండి బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సతీష్ తెలిపారు.ఇప్పుడు కూడ బిజెపి పార్టీ కి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధినాయకత్వం ఆలోచించి నాకు బిజెపి పార్టీ టికెట్ ఇస్తే పద్మారావు గౌడ్ మీద గెలిచి కేంద్రానికి కానుక గా ఇస్తానన్నారు.సికింద్రాబాద్ తో పాటు బండారు దత్తాత్రేయ కూతురు కూడా టికెట్ ఇవ్వకపోవడానికి వెనకాల ఉన్న రహస్యం ఎంటన్నారు? ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను.ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని సతీష్ మీడియా తో మాట్లాడారు.
ఎన్నికల్లో ఉచిత హామీలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చగలమా? లేదా? అందుకు తగిన ఆర్థిక వనరులు ఉన్నాయా? అని అంచనా వేయకుండానే పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తుంటాయని విమర్శించారు. దేశంలో పేద, మధ్య తరగతి, అంతకంటే దిగువన ఎంతోమంది జీవిస్తున్నారని పేర్కొన్న ఆయన.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ హామీపై మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని హామీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ ఒక్క ఢిల్లీ ప్రభుత్వానిదే కాదని, కేంద్రంతోపాటు పక్క రాష్ట్రాలూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.
జనగామ జిల్లా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ మోసం చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ 2018 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని అన్ని మోసపూరిత హామీలు ఇస్తుందని మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్, హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు.
ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీ… అదే ఒరవడిని కొనసాగిస్తూ మంత్రి హరీశ్ రావు కూడా 2004 ఎన్నికల నుండి పెద్ద సారును ఫాలో అవుతూ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా నామినేషన్ ఈ నెల 9వ తేదీన గజ్వెల్ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ పత్రాలను కేసీఆర్ దాఖలు చేయనున్నారు..ఐదు రోజుల ముందునే స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కెసిఆర్, హరీష్ రావులు బిజీ బిజీగా ఉండడం, రేపు మంచి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు పూర్తిచేసి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తుండడం,హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో బిజీ బిజీ షెడ్యూల్ తో సభలలో పాల్గొంటున్నారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి వద్ద, సిద్దిపేట రిటర్నింగ్ అధికారి వద్ద హరీష్ రావు నామినేషన్ పాత్రాలను దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,హరీశ్ రావు లకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలక్షన్ల ప్రతిసారి కెసిఆర్,హరీశ్ రావులు ఈ గ్రామానికి రానుండడంతో గ్రామంలో పండుగ వాతావరణంలో వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మహిళలు గ్రామస్తులు సిద్ధమయ్యారు.
శుక్రవారం నుండి నియోజక వర్గాలలో మరింత నిఘా బృందాలు పనిచేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అక్రమంగా విపరీతంగా నగదు, బంగారం ఇతర అభరణాలు, ప్రవాహాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఒక వైపు మరోకవైపు పోలీస్ శాఖ తనిఖీలు, ఇంకొక వైపు ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆ క్రమంగా నగదు, వివిధ రకాల ఆభరణాలు, నిరోధించెందకు 18 చెక్ పోస్ట్ ల ఏర్పాటుచేశారు. మనీ మేనేజ్మెంట్ సంస్థల ను కూడా నగదు ప్రవాహం తనిఖీ చేసేందుకు వాహనాలకు జి పి యస్ సిస్టమ్ అమర్చి ఎప్పటి కప్పుడు పరిశీలన, మద్యం షాపులు వద్ద కూడా అక్రమ రవాణా తగ్గించేందుకు సిసి కెమెరా అమర్చి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటి కప్పుడు పరిశీలన చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, చెక్ పోస్ట్, వద్దకుడ సిసి కెమెరా లను పేట్టి జి హెచ్ ఏం సి కార్యాలయం నుండి పరిశీలన. జేసీ అక్కడ తప్పులను సరిదిద్ది సక్రమంగా చేసేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జిల్లా ఎన్నికల అధికారి తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో నగదు ఆభరణాలు, మద్యం, మరక ద్రవ్యాలు, పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 45 కోట్ల 89 లక్షల రూపాయల విలువ గల సొత్తును పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజక వర్గంలో నవంబర్ 3 వ తేదీ నుండి. నామినేషన్ లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుండి స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ టీమ్ ల ను నియోజక వర్గం వారీగా ఏఒక్కొక్క నియోజక వర్గం లో 9 టీమ్ లను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పని చేసే విధంగా సిబ్బందిని నియిచడం జరిగింది ప్రతి నియోజక వర్గం లో వేర్వేరు ప్రదేశాలలో స్టాటిస్టిక్స్ సర్వే లెస్ టీమ్ లను పని చేస్తూ అక్రమంగా ప్రవహిస్తున్న నగదు, ఆభరణాలు, మద్యం మత్తు పదార్థాల లైనా, గంజాయి, డ్రగ్స్ పట్టుకునేందుకు ఈ టీమ్ ల నిఘా చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు, ఆభరణాలు, సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పిర్యాదు ల కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు సూచించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబుతో కాసాని ములాఖత్‌లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగాా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాల్లో తాను సీఎం అవుతానని అన్నారు. దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా, ఆ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని అన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వల్ల తన నోరు, చేతులు కట్టి పడేసినట్లు అయిందని, లేదంటే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు. తాను ఎల్లప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నా, లేకపోయినా.. తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు.





Total views : 90592