చలికాలంలో నచ్చిన వంటకాలు తింటూ శారీరక చురుకుదనం లోపించడంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల ద్వారా వింటర్లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో అధిక క్యాలరీలతో కూడిన పరాటాలు, పూరీలకు బదులు బరువు నియంత్రణలో ఉండేందుకు మొక్కజొన్న రోటీలను తినడం మేలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మొక్కజొన్న రోటీలతో బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మొక్కజొన్న గ్లూటెన్ రహితం కావడంతో గ్లూటెన్ సరిపడని వారు సైతం నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు. ఇక మొక్కజొన్న పిండిలో ప్రొటీన్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సహా పలు విటమిన్లు ఉండటంతో దీన్ని పోషకాల గనిగా చెబుతారు.
fiber
డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సంరక్షణలో ముఖానికి సహజసిద్ధమైన మెరుపునిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఈ పండును తినడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. గుండె సమస్యలను దూరం చేస్తుంది. వారానికి రెండు సార్లు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అల్జీమర్స్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందించి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. శరీరానికి కావల్సిన అన్నిరకాల పోషకాలను ఇది కలిగివుంటుంది. వారానికి ఒక్కసారైనా తింటే మంచి ఫలితాలు పొందుతారు. శరీర వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయి.
మలబద్ధకం కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయట పడితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. అందుకే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోండి. చిలగడ దుంప తినడం వల్ల మలబద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఓట్స్ తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన మలవిసర్జన అవుతుంది. అంతే కాకుండా జీర్ణ, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం మంచిది. చాలా మంది టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది.
ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతున్నారా..? ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న సందేహం. మరి మీకూ అలాంటి సందేహం ఉందా. అయితే ఇది చదవండి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రెజర్ కుక్కర్లో అన్నం ప్రయోజనకరమేనట. ప్రెజర్ తో ఉడకడంవల్ల అన్నం రుచిగా ఉంటుంది. కుక్కర్లో వండిన అన్నంలో పిండిపదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఊబకాయానికి ప్రధాన కారణం పిండిపదార్థమే. ఇదిలావుంటే ప్రెజర్ కుక్కర్లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ లాంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. కుక్కర్లో అన్నంతో ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు. ప్రెజర్ కుక్కర్లో వండిన అన్న సులువుగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి. ఎక్కువ ప్రెజర్ లో ఈ అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి. ఈ విధంగా ప్రెజర్ కుక్కర్లో వండే అన్నంలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాక వంట వేగంగా సిద్ధమవుతుంది. మంటపై ఎగిరినట్లుగా అన్నం ఎగరకపోవడంవల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.
Read Also..
Read Also..
బీట్ రూట్ జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు మందు, వ్యాయామం, సాల్ట్ షేకర్ తో పాటు ఓ గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగమని వైద్యులు చెబుతుంటారు. గ్లాసు రసం పోషకాహారాన్ని అందిస్తుంది. అంతేకాదు శక్తిని పెంచి వాపును తగ్గిస్తుంది. ఇస్కీమిక్ గుండె జబ్బులు, క్యాన్సర్‌ను కూడా నిరోధిస్తుంది. విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి. మలబద్ధకం నుండి ఉపశమనానికి తోడ్పడతాయి. వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఉంది. దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్రూట్ ఎంతో ప్రయోజనకరమైంది. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలు బీట్ రూట్ ను కొరకడం ద్వారా పరిష్కారమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర కూరగాయలతో పాటు దీన్ని కూడా సమానంగా ఉంచితే ఎంతో ప్రయోజనం ఉంది. వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది. అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు. శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి. ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పవచ్చు. బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Read Also..
Read Also..
ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదం పప్పు కూడా ఒకటి. సూపర్ ఫుడ్‌గా పిలవబడే బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి.ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బాదం ప్రతి రోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్నది చాలా మందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే. మరికొందరు బాదంను డైరెక్ట్‌గా తింటుంటారు. కానీ, నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకు మంచిది అంటే. బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఆకలి తగ్గిస్తుంది.తద్వారా బరువు తగ్గొచ్చు. మరియు బాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో సహాపడతాయి.
Read Also..
Read Also..
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు’ అంటున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూవర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు ప్రాధాన్యం ఇప్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్, కఫాన్ని తగ్గిస్తుంది. రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే ‘పెక్టిన్’ అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర్ తరహా మాత్రం కొంచెం తీవి, వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్ పొర తగ్గుతుంది.