శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
Film News
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిన యువకులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఆందోళన చేస్తున్న యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుంది అని సరైన బుద్ధి చెబుతామని యువకులు అన్నారు. దాదాపు 100 మందికి పైగా యువకులు ఒక్కసారిగా బొత్స క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మెగా డీఎస్సీ తో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన యువజన సంఘం నాయకులు.
అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు. బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం. చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్. మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు. మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్. తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి. పత్తాలేని హాస్టల్ వార్డెన్. చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు.
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.
మహర్షి కూండ్ల సమర్పణలో వరుణ్ సందేశ్ హీరోగా ఎమ్ 3 మీడియా (M3 Media) మరియు మహా మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా ద్వారా శ్రీ అద్యాన్త్ హర్ష డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ముహూర్తపు షాట్ కి హీరో వరుణ్ సందేశ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ అజయ్ కుమార్ మొదటి షాట్ చిత్రీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో
చిత్ర హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ”సరికొత్త కథాంశంతో తీస్తున్న సినిమా ఇది. కథ, కథనాలు చాలా కొత్తగా గా ఉంటాయి. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది” అని ప్రేక్షకులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
చెప్పారు.
దర్శకుడు అద్యాన్త్ హర్ష మాట్లాడుతూ “ఇదొక విభిన్నమైన కథాంశంతో వస్తున్న థ్రిల్లర్ చిత్రం, హీరో లుక్ మరియు అతని క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి” అని తెలిపారు.
చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “డిఫరెంట్ మేకింగ్ అండ్ టేకింగ్ తో ఈ సినిమా ని నిర్మించబోతున్నాం. లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. కధ, కథనం తో పాటు విసుల్స్ కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినించే చిత్రంగా దీన్ని నిర్మించబోతున్నాం” అని చెప్పారు.
బ్యానర్ : ఎమ్ 3 మీడియా (M3 Media), మహా మూవీస్
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణా దేవి, కుషాలిని పూలపా, ప్రసాద్ బెహరా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.
సాంకేతిక బృందం:
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
స్టిల్స్: మోహన్
పబ్లిసిటీ డిజైనర్: గణపతి రత్నం
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అర్జున్ కిన్నెర
పి.ఆర్.ఓ- పాల్ పవన్
ఎడిటర్: రామ్ తుము
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అజయ్ కుమార్
సమర్పణ: మహర్షి కూండ్ల
ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల
కథ – దర్శకత్వం: అద్యాన్త్ హర్ష
ఘనంగా వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 – డా. ఎం. మురళీమోహన్ గారికి సన్మానం
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ : సినీ పెద్ద మురళీమోహన్ గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు బొప్పన గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అన్నారు. బిజీ షెడ్యూల్ ని కూడా పక్కనపెట్టి మురళీమోహన్ గారి కోసం ఈవెంట్ కి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్ గారు ఆయన్ని సన్మానించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది అలాంటి వ్యక్తికి సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. విజయవంతంగా విష్ణు బొప్పన గారు వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఆపకుండా చేయడం పదో వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. విష్ణు బొప్పన గారికి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది అంటూ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలను కొనియాడారు.
మురళీమోహన్ గారు మాట్లాడుతూ : విష్ణు బొప్పన గారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మంత్రిగారు చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో బిజీగా ఉండి కూడా ఈవెంట్ వచ్చి నా సన్మానానికి హాజరై ఇలా ఆశీస్సులు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ ఇలా పదో వార్షికోత్సవం విజయవంతంగా జరుపుకోవడం ఈ ఫంక్షన్ లో నన్ను సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విష్ణు బొప్పన గారు ఇలాగే అవార్డ్స్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అవార్డులు వాళ్ళు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అవార్డులు అందిస్తోంది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మళ్లీ అది మొదలు పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వాలి అలానే ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా మీ ప్రభుత్వం చూడాలి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను అన్నారు.
మురళీమోహన్ గారు చేసిన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందిస్తూ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ మురళీమోహన్ గారు చెప్పిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా గవర్నమెంట్ కచ్చితంగా పూర్తి చేస్తాము. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే. గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్ చేస్తుంది అని ఘాటుగా స్పందించారు.
వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన గారు మాట్లాడుతూ : ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అవార్డ్స్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడానికి కారణం మా స్పాన్సర్ విజన్ వి వి ఈ హౌసింగ్ ఇండియా, ఎస్ ఎస్ ఎల్ గ్రూప్, ఆదూరి గ్రూప్, డి ఎస్ ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా, ఆరాధ్య గ్రూప్, కేశినేని డెవలపర్స్ మరియు హో జాయ్ కంఫర్ట్ వారు ఇచ్చిన సపోర్ట్. ఈ సంవత్సరం తో పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పదో వార్షికోత్సవ అవార్డ్స్ సందర్భంగా మురళీమోహన్ గారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ కి బిజీగా ఉన్నా మా మనవిని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డు ఫంక్షన్లు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథులుగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో కల్కిలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ గొప్పగా ఎంజాయ్ చేసేలా ‘కల్కి’ వుంటుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్
ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.
తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్’23లో కల్కి 2898 AD’ ప్రత్యేక కంటెంట్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన Q &Aలో ‘కల్కి 2898 AD’ చిత్రానికి సంబధించిన విశేషాలని పంచుకున్నారు నాగ్ అశ్విన్.
మిగతా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు కల్కికి ఎంత భిన్నంగా వుంటుంది.. ?
-మన దగ్గర సైన్స్ ఫిక్షన్ చిత్రాల ఎక్కువ రాలేదనే చెప్పాలి. కొన్ని టైం ట్రావెల్ సినిమాలు వచ్చాయి . కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. ‘కల్కి’లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా వుండబోతునాయో ప్రేక్షకులు చూస్తారు. ‘కల్కి’ కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.
టీజర్ లో కొత్త ఆయుధాలు కనిపించాయి.. వాటి గురించి చెప్పండి ?
-కల్కి కోసం చాలా డిజైన్ వర్క్ చేశాం. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్స్ డిజైనర్స్ ఇలా టీం అంతా కలసి చాలా మేధోమధనం చేశారు. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిది భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్ లో ఎలా మార్పు చెందే అవకాశం వుందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రతిది డిజైన్ చేశాం. తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం వుంది.
ప్రభాస్ గారితో పాటు మితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు కదా.. వారి పాత్ర గురించి చెబుతారా ?
-వారి పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు. అయితే మితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు , దీపికా పదుకొణె.. వీళ్ళ అభిమానులంతా అమితంగా ఆనందపడే పాత్రల్లో వారు కనిపిస్తారు. ఇదివరకూ ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వారు కనిపించలేదు. తప్పకుండా ఫ్యాన్స్ ని అలరిస్తారు.
కల్కికి… ‘2898 AD’ అనే టైమ్ లైన్ పెట్టడానికి కారణం ఏమిటి ?
-దీనికి వెనుక ఒక లాజిక్ వుంది. అయితే అది సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో చెబుతాను(నవ్వుతూ)
ఈ చిత్రం మ్యూజిక్ కోసం సంతోష్ నారాయణ్ ని తీసుకోవడానికి కారణం ?
-ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇచ్చే కొద్దిమంది కంపోజర్స్ లో సంతోష్ నారాయణ్ ఒకరు. అందుకే ఆయన్ని తీసుకోవడం జరిగింది.
కల్కి కోసం ప్రభాస్ గారు ఎలా మేకోవర్ అయ్యారు ? ఇందులో ప్రభాస్ ని కొత్తగా చూడొచ్చా ?
-కల్కిలో ఫ్యూచర్ ప్రభాస్ ని చూస్తారు(నవ్వుతూ)
కల్కి, విష్ణు అవతారం అంటారు కదా.. మీరు కూడా నాగీ యూనివర్స్ ని ప్లాన్ చేస్తున్నారా ?
-లేదు(నవ్వుతూ)
ప్రభాస్, కమల్ హసన్, అమితాబ్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
-అందరూ అద్భుతమైన వ్యక్తులు. గ్రేట్ యాక్టర్స్. చాలా హంబుల్ గా వుంటారు. వారికి సినిమా అంటే ప్రేమ, ఇష్టం. వీరిలో వుండే సిమిలర్ క్యాలిటీ ఇది.
కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు ?
-త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం
కల్కి ట్రైలర్ ఎప్పుడు విడుదల కావచ్చు ?
-93రోజుల తర్వాత ఉండొచ్చు (నవ్వుతూ)
ఆల్ ది బెస్ట్ అండీ
థాంక్ యూ
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.