ట్రాక్టర్ లీజు (Tractor Lease) :
అమాయక రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు (Tractor Lease) పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్లు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యా రెడ్డి, హాజీపేరా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈ రోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇది చదవండి : వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు 25 వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.
పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తాడిమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు… - పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై… - నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే..ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రజాస్వామ్యంలో…








Total views : 194138