యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామని కలలుగన్న జనసైనికులకు సమాధానం చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే మాటకు రెండో మాట లేదని అనుభవంతుడైన నాయకత్వం కావాలి అనే మాటను పలుసార్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడని జోగయ్య అన్నారు. అంటే పూర్తికాలం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండేందుకు మీ ఆమోదం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే సామాజిక వర్గాలు రాజ్యమేలుతున్నాయని జోగయ్య విమర్శించారు. 80 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని జనసేనానిని ప్రశ్నించారు హరిరామ జోగయ్య.
harirama jogaiah
ప్రస్తుతం జనసేన కేడర్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..’ అని హరిరామజోగయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్‌కు మధ్య జరుగుతున్న వార్ ఇదని అయన తెలిపారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా…. తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు.






Total views : 78783