Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh పవన్ కు జోగయ్య సంచలన లేఖ..!

పవన్ కు జోగయ్య సంచలన లేఖ..!

by Satya
Jogaiah's sensational letter to Pawan

యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామని కలలుగన్న జనసైనికులకు సమాధానం చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే మాటకు రెండో మాట లేదని అనుభవంతుడైన నాయకత్వం కావాలి అనే మాటను పలుసార్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడని జోగయ్య అన్నారు. అంటే పూర్తికాలం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండేందుకు మీ ఆమోదం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్‌ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే సామాజిక వర్గాలు రాజ్యమేలుతున్నాయని జోగయ్య విమర్శించారు. 80 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని జనసేనానిని ప్రశ్నించారు హరిరామ జోగయ్య.

Advertisements

You may also like

Our Visitor

042282
Total views : 223750

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: