ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
harish rao
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ.. అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. దాడి జరిగిన తీరును బాలరాజును అడిగి తెల్సుకున్నారు హరీశ్ రావు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగటం హేయమైన చర్య అని ఇలాంటి దాడులు చేసే సంస్కృతికి ఓటుతో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. బాలరాజుకు పార్టీ అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బాలరాజుకు ధైర్యం చెప్పారు హరీశ్ రావు.
హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని, ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.
ఒక వ్యక్తిని రెచ్చగొట్టి మందు తాగించి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేయించారు – హరీశ్ రావు
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్, హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు.
ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీ… అదే ఒరవడిని కొనసాగిస్తూ మంత్రి హరీశ్ రావు కూడా 2004 ఎన్నికల నుండి పెద్ద సారును ఫాలో అవుతూ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా నామినేషన్ ఈ నెల 9వ తేదీన గజ్వెల్ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ పత్రాలను కేసీఆర్ దాఖలు చేయనున్నారు..ఐదు రోజుల ముందునే స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కెసిఆర్, హరీష్ రావులు బిజీ బిజీగా ఉండడం, రేపు మంచి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు పూర్తిచేసి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తుండడం,హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో బిజీ బిజీ షెడ్యూల్ తో సభలలో పాల్గొంటున్నారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి వద్ద, సిద్దిపేట రిటర్నింగ్ అధికారి వద్ద హరీష్ రావు నామినేషన్ పాత్రాలను దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,హరీశ్ రావు లకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలక్షన్ల ప్రతిసారి కెసిఆర్,హరీశ్ రావులు ఈ గ్రామానికి రానుండడంతో గ్రామంలో పండుగ వాతావరణంలో వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మహిళలు గ్రామస్తులు సిద్ధమయ్యారు.
మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మి సాయి గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, మల్లారెడ్డి, శంబిపుర్ రాజు స్థానిక నాయకులు, ఉద్యమ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే గుండాలు కాదు సౌమ్యులు కావాలని అలాంటి మంచి వ్యక్తే మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అని ఆయనను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంది. మన లాంటి స్కీములు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. కాంగ్రెస్ పార్టీ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు వివరించారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.