కృష్ణా జిల్లా గుడివాడ, గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, బైక్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారు. చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నా. ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా. చంద్రబాబు కదలి రా అని తిరుగుతుంటే. కోర్టులు జైలుకు కదలి వెళ్ళు అంటున్నాయి. బాడీలో పార్టులు పని చేయడం లేదని చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారు. బాలకృష్ణ , చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది కలిసి వచ్చిన ఫ్లెక్సీలు తొలగించడం తప్ప. జూ. ఎన్టీఆర్ ను ఎం చెయ్యలేరు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు మూడు సార్లు గుడివాడలో పర్యటించి తనకు డిపాజిట్లు ఉండవన్నారు ఎం జరిగింది ? తిరిగి ఇప్పుడు అదే జరుగతోంది. చంద్రబాబును గుడివాడలో పట్టించుకునే వారు ఎవరున్నారు. చంద్రబాబు రా కదలి రా సభలో 5వేల కుర్చిలు వేస్తే. లక్ష మంది ఎలా వస్తారు. సీఎం జగన్, పార్టీలో పికేసిన వాళ్ళే బయటకు వెళ్తున్నారు. పది రోజులైతే టిడిపి, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు. ఒక్క శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే తమకు వచ్చే నష్టం లేదు. జగన్ అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. పదవులు తనకు ఈక ముక్కతో సమానం అని ఆయన అన్నారు.
health news
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ రెండు రోజుల క్రితం అనుమతి లేకుండా ధర్నా చేయటం పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలపడం పోలీసుల విధులకు ప్రజలకు ఆటంకం కలిగించడం, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల హెడ్ కానిస్టేబుల్ పాండురంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద తంగిరాల సౌమ్య, తేదేపా శ్రేణుల పై కేసు నమోదు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం నా అదృష్టం. నందమూరి తారక రామారావు గారే సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టారు. పేద ప్రజల సంక్షేమం కోసం వందల పేజీలు రాయకుండా, కూడు, గూడు, గుడ్డ అనే మూడే మూడు నినాదాలతో ముందుకు సాగిన మహా నాయకుడు ఎన్టీఆర్. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్టీఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందు సాగుతున్నానని అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారం. కానీ ఒకాయన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడటం వారి స్థాయినే దిగజార్చుతుంది తప్పితే ఎవరికీ ఏమీ కాదు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పటమట లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మరియు టిడిపి నాయకుడు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగారు. ఏ రంగం లో ఉన్న ఆయన అగ్రగామిగా నిలిచారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి వారసులు అయినందుకు గర్వపడుతున్నాం.
పల్నాడు జిల్లా, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు ఈ సందర్భంగా మాజీ మంత్రి ,టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీఆర్. ప్రపంచ దేశాల్లోనే తెలుగుజాతికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నటనలో కానీ, రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదనిపించుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి, వెనుకబడిన వర్గాల వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారకరామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అమరావతి, ఈనెల 22న రామ మందిరం లో బాలరామని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది. రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం. ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు. 22వ తేదీన దేశం మొత్తం విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారు. 22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. 21 వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థం అవుతుంది. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలి అని అన్నారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష. ఉపఎన్నికల ఆర్వో రాజకీయ భజన. గిరిషా పై ఈసి సస్పెన్షన్ వేటు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం. అప్పటి తిరుపతి ఆర్వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం. నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీకి ఆర్వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం. అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఆర్వోపై చర్యలకు ఈసీ ఆదేశం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా. ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా, ఆర్వోగా ఉన్న గిరీషా. అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు,ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు.
పోలిసులను నిలదీసిన సీఐటీయూ, సీపీఎం నాయకులు. పెండింగ్ లో ఉన్న జీతాల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న శ్రీ రామి రెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై R.W.S అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు తెలిపారు. తాము సమ్మె లో ఉండటం తో పై అధికారులతో పాటు కనేకల్ మండలం సోల్లాపురం గ్రామ సర్పంచ్ భర్త అవగాహన లేకుండా మోటార్లు అన్ చెయ్యడం తో కౌకుంట్ల గ్రామం వద్ద పైప్ లైన్ పగిలిపోయిందన్నారు, వారి పై చర్యలు తీసుకోకుండా సమ్మె లో ఉన్న తమ పై కేసులు పెట్టడం ఎంటని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న దళిత కార్మికులను చులకనగా చూసిన అధికారుల పై SC,ST కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.





Total views : 92878