కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉవకరిస్తుంది. రక్తవ్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. దేహ వుష్టికి ఉవకరిస్తుంది. అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము . దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణర ఉంది. చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. నోటి దుర్వాసన గలపారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉరటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. సూవర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అరజీర్‌లలో మినరళ్లు అధికం. అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. తలనొవ్పి, కీళ్లనొవ్పులు, కడువులో మంట గలపారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన వండ్లకు ప్రాధాన్యం ఇప్వొచ్చు. దీనిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర వట్టడానికి సాయవడతాయి. ఎలర్జీ దగ్గు, కఫం గలపారు ఈ వండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. మేడివండు గొంతు ఇన్ఫెక్షన్, కఫాన్ని తగ్గిస్తుంది. రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే ‘పెక్టిన్’ అనే వదార్థము కొవ్వును అదువులో ఉంచుతుంది. ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ వండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి. సలపరింవు తగ్గుతుంది. అన్ని మేడివండ్లు ఒకే రుచిలో దొరకవు. మనకు విరివిగా లభించే అంజీర్ తరహా మాత్రం కొంచెం తీవి, వగరుగా ఉంటాయి. పులువు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్ పొర తగ్గుతుంది.
Health
కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఎలర్జీకి తగ్గుటకూ శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి. మూత్ర సంబంధ వ్యాధులకు జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. నీరసము తగ్గుటకు ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు. పైత్యరోగాలకు జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును. తేలుకుట్టుకు జీలకర్ర , తేనె , ఉప్పు , నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును. నీళ్ళవిరోచనాలు తగ్గుటకు అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి … చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి. వాంతులు తగ్గుటకు వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును.
ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం. అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్ సమస్య బాధించదు. రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి. నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.
కొన్ని రకాల పదార్థాలు మానేసి… మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి. పొద్దున టిఫిన్, రెండుపూటల భోజనం… ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్ని తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది. కప్పు నిండా ఐస్‌క్రీం, పైన నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో తినే అలవాటు తగ్గించుకోండి. బదులుగా కప్పునిండా పండ్లముక్కలు తీసుకుని దానిపైన చెంచా ఐస్‌క్రీం వేసుకోండి. సలాడ్‌పై చాలా కొద్దిగా చీజ్ వేసుకోవడం లాంటివన్నీ కెలొరీలు తగ్గించే ప్రత్యామ్నాయాలే. పొద్దుటిపూట తిఫిన్ తిన్నాక ఓ గ్లాసు బత్తాయీ, కమలాఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దాంతో అదేపనిగా ఎక్కువగా తినడం జరగదు. ఆకలితో సంబంధం లేకుండా, మీ ముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్లెం తీసుకొని, కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే, అన్నం ఒక్కటే కాదు, టిఫిన్, స్నాక్స్ ఏవయినా సరే… భోజనాల బల్ల దగ్గరే తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీవీ, కంప్యూటరు ముందు కూర్చుని తినే అలవాటు తప్పుతుంది. నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నా సరే… పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కెలొరీలూ తగ్గుతాయి.
విటమిన్ డి లోపం సమస్యలు
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ డి లోపం వల్ల ఎముకల సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం, కండరాల నొప్పులు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
విటమిన్ డి లోపం నివారణ
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తినడం మరియు ఎండలో కొంత సమయం గడపడం ద్వారా విటమిన్ డి లోపాన్ని నివారించవచ్చు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వైద్యుడి సలహాతో తీసుకోవచ్చు.
ముగింపు
విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి అవసరాన్ని తీర్చుకోవడం చాలా ముఖ్యం.
పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్ ‘ఎ’, ‘సి’లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోషకాలుంటాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి. కెలొరీలని కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. వీటిల్లో పుష్కలంగా ఉండే ‘ఎ’ విటమిన్‌మెరుగైన కంటిచూపూ… ఎముకలూ, పళ్ల బలానికి సాయపడుతుంది.
Read Also..
Read Also..
గుండెకు మంచిది ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మధుమేహం ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది. జలుబు, జ్వరం దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది. అరుగుదల పెరుగుతుంది అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది. వ్యాధినిరోధక శక్తి ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. పెద్దప్రేగు కాన్సర్ ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, ఉబ్బసం ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ. జీవక్రియ స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం. కళ్ళు ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి. ముడతలను తొలగిస్తుంది : కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది.
నారింజ, నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటిల్లోని లిమోలిన్ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది. దీన్ని కాలేయ క్యాన్సర్ బారినపడేలా సృష్టించిన ఎలుకలకు ఇచ్చినపుడు అవి జబ్బు నుంచి కోలుకున్నట్టు తేలింది. నిజానికి లిమోలిన్ నేరుగా కణితులపై పనిచేయటం లేదు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్‌పై పోరాడేలా తీర్చి దిద్దుతోంది. ఇది యాంటీఆక్సిడెంట్ల మోతాదునూ పెంచి, విశృంఖల కణాలను తగ్గిస్తున్నట్టూ బయట పడింది.
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా… వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.
ఒక లీటర్ నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్ ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి. కూరగాయలు లేక పళ్ళ మీద ఉన్న పురుగుల మందుల అవశేషాలు పోయి శుభ్రపడాలంటే కొంచెం బేకింగ్ సోడా వేసిన నీళ్ళతో కడిగితే సరి. మాంసం వండటానికి ముందు దానికి బేకింగ్ సోడా పట్టించి రెండు లేక మూడు గంటలు ఫ్రిజ్ లో ఉంచి తీయండి. తరువాత దానిని శుభ్రంగా కడిగి వండితే మృదువైన, రుచికరమైన మాంసం తయార్. తడిపిన స్పాంజ్ మీద కొంచెం బేకింగ్ సోడా చల్లి దాంతో ఫ్రిజ్ ను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. ఒక చిన్నబాక్స్ లో కొంచెం బేకింగ్ సోడాను ఉంచి దాన్ని ఫ్రిజ్ లో ఉంచితే దుర్వాసనలన్ని పోయి చక్కగా ఉంటుంది. చెమటతో శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొంచెం బేకింగ్ సోడాను చెల్లితే శరీర దుర్వాసన మాయం. టొమాటో వంటి పుల్లటి సూప్ కు మంచి రుచి రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా కలిపితే సరి. పొట్టలో మంట లేక అనిజీగా ఉన్నప్పుడు కప్పు నీళ్ళలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడన్నా మాత్రమే వాడాలి. తరుచుగా వాడకూడదు. కొంచెం బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి దానిని వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల జిడ్డుగా ఉన్న చోట రాసి ముందు తడిబట్టతో ఆపై పొడిబట్టతో తుడిస్తే శుభ్రపడుతుంది. కొంచెం వేడి నీళ్ళలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్ లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది.





Total views : 90572