ఈ వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటోన్న వారికి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయితీ కార్డులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాయితీ ప్రయాణాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలులో 59 రూపాయల హాలిడే కార్డు అమలులో ఉండేది. ఈ రాయితీ కార్డును అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. దీనితో పాటు సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకొచ్చిన 10 శాతం రాయితీని కూడా ఎత్తేసినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే – తెల్లవార జామున 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో కల్పించే 10 శాతం రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
hyderabad metro rail
హైదరాబాద్ మెట్రో రైలు మార్గం రెండోదశ విస్తరణ రూట్ మ్యాప్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్‌మ్యాప్‌ను రద్దు చేయాలని, కొత్త మార్గాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు విమానాశ్రయం సహా వివిధ కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేలా కొత్త రూట్‌మ్యాప్‌ను డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న మెట్రో రైలు సేవలు మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ రూట్‌మ్యాప్‌తో నెరవేరనుందని అంచనా వేస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌ను కలుపుతూ కొత్త మార్గాలను మ్యాప్‌లో అధికారులు ప్రతిపాదించారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు కనెక్షన్ విషయంలో ముఖ్యమైన మలుపు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపేశారు. పాత బాలాపూర్, ఫలక్నామా గుండా ఓల్డ్ సిటీ మీదుగా కొత్త మార్గం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రయోజితమే ప్రధానం:
ఆలేరు-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల పొడవు, రూ. 6250 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రైలు వెళ్లనుంది. అయితే, ఈ మార్గం ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగించదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని రేవంత్ భావించారు. అందుకే ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గం పరిశీలించాలని నిర్ణయించారు.
ఓల్డ్ సిటీకి కనెక్షన్:
పాత నగర ప్రజలకు ఎయిర్‌పోర్ట్‌కు సులువైన కనెక్షన్ కల్పించే దిశగా కొత్త మార్గం ప్రతిపాదన ఉంది. ఎల్బీ నగర్, ఫలక్నామా నుంచి చంద్రాయణగూట, ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రైలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఓల్డ్ సిటీలోని లక్షలాది మంది ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. అదే కాకుండా, ఐటీ కారిడార్ ప్రాంతంలో కూడా స్టేషన్లు ఏర్పాటు చేస్తే మెరుగుపడుతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
పరిశీలన అనంతరం నిర్ణయం:
కొత్త మార్గం పరిశీలన జరుగుతుంది. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులు, ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్గం ఖరారు చేయనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో సమగ్ర పరిశీలన జరిగి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రైలు మార్గం ఏర్పాటు కావాలని హైదరాబాద్ వాసులు ఆశిస్తున్నారు.





Total views : 79552