ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
hyderabad
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతుండగా కొందరు నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు, పోటీ చేయొద్దని కొందరు నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తక్షణమే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలకు కాసాని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని తెలుస్తోంది. మరోవైపు దమ్ముంటే కాసాని ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మరి కొందరు నేతలు సవాల్ విసిరారని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం. పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.30 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు… రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని, ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కోల్పోతోందని చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దిన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది.
హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు.



Total views : 92047