గత తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న వ్యాఖ్యలకు రాయలసీమ వాసులకు ఎలాంటి సంబంధం లేదని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. పంజాగుట్ట లోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధి సుస్థిరపాలనకే తమ మద్దతు, మేము సెటిలర్స్ కాదు తెలంగాణీయులమే అంటూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రజలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో సీమ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఇటీవల కొందరు సీమాంధ్ర ప్రజల పక్షాన మాట్లాడుతున్నామని చెప్పి చేసే వ్యాఖ్యలు తీవ్ర విచారకరమని అన్నారు. రాయలసీమ వాసులు ఎవరు ఈ తరహా వ్యాఖ్యలను సమర్ధించారని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
hyderabad
ప్రజల్లో ఓటు పట్ల అవగాహన కల్పించి ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు తమకున్న రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంబోత్ రాంబాబు స్పష్టం చేశారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో తమ జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 60 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల పై పెట్టిన శ్రద్ద విద్య , వైద్యం , ఉపాధి అంశాలపై పెట్టలేదని విమర్శించారు. అధికార బిఆర్ఎస్ పార్టీ తమకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులను కలరాస్తుందని మండిపడ్డారు. తాము ఈ పోటీలో గెలవకపోయిన తమను విస్మరించిన వారిని ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్ గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్సచిన్‌తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరుఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ మారథాన్‌లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.
జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్గీ అభ్యర్థి మధు యాస్కీ గౌడ్, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా MLA సుదీర్ రెడ్డి , అతని అనుచరులను ఓడించేందుకు ఐక్యంగా కదులుతున్నారని అన్నారు. మా ఐక్యత చూసి సుదీర్ రెడ్డి కి లాగులు తడుస్తున్నాయని అన్నారు. చైతన్యపురి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్ రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మధు యాస్కీ మాట్లాడుతు..సుదీర్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంబడి పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్ రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారని అన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బినగర్ ప్రజలను కోరారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు,వికలాంగులు, ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు, ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం లో ముందు నడిచిన రాష్ట్ర సాధన కు కృషి చేసిన మధు యాష్కీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం గా ఉందని, మధు యాష్కీ గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని యువకులు ఉద్యమకారులు తెలిపారు. విద్యార్థి,ఉద్యమ అమరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణ లో ఉద్యమ కారులకు, విద్యార్థులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీనగర్ ప్రజలు మధు యాష్కీ ని గెలిపించుకోవలని కోరారు.
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు. భారాస పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్ని దేవోల్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది. కానీ, విపక్షాలకు కనిపించట్లేదు అని విమర్శించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ సిద్ధాంతం అని కేటీఆర్ అన్నారు. ఈ తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు? కేసీఆర్‌కు ఎందుకు ఓటు… వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలి. ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారు. వారు చెప్పిన మాటలు విని ఆగమైతే.. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ హయాంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయి అని కేటీఆర్ తెలిపారు.
ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు. ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేస్తుండటంతో హై టెన్షన్ చోటు చేసుకుంది. రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు. గాలిలోకి కుర్చీలను దండెంరాంరెడ్డి వర్గీయులు విసిరేశారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని.. టికెట్ ఇవ్వకుంటే రెబల్ గా పోటీచేస్తానని రాంరెడ్డి తెలిపారు.



Total views : 92083