హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
hyderabad
మల్కాజిగిరి నేరెడిమేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమతా నగర్ లో మహిళా హత్యా ఘటన కలకలం రేపింది, భార్యాభర్తలు గొడవ ఈ హత్యకు కారణం గా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఏ.స్రవంతి (22)సం w/ఓ మహేందర్ R/o.
భార్య తో గొడవపడ్డ మహేందర్ తన భార్య స్రవంతిని హత్యా చేసి ఆత్మహత్యగ చిత్రీకరించే ప్రయతం చేసాడు. హంతకుడు మహేందర్ పరారీలో ఉండతం తో అనుమానం వచ్చిన నేరెడిమేట్ పోలీసులు క్లూస్ టీం సహాయం తో దర్యాప్తి చేస్తున్నారు…
ఉమ్మడి ఏపీలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. హైదరాబాద్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నమని చెప్పారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి. హరీష్ రావు స్పష్టం చేశారు. కే ఎల్ యూనివర్సిటీ బోరంపేట క్యాంపస్ లో అత్యాధునికంగా ఏర్పాటుచేసిన ఆపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఐ. టి. ఉద్యోగాలను అందించగలిగామని, పారిశ్రామిక రంగంలో మరో 24 లక్షల ఉద్యోగాలను అందించామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాట్లకు కావాల్సిన అన్ని రకాల మౌళిక వసతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తద్వారా హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. కే ఎల్ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు అమ్మాయిలు 50 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ పొందటం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనేక పధకాలను అందుబాటులోకి తెచ్చామని, వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని హరీష్ రావు చెప్పారు. కే ఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్ నెల 15 నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు, మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కే ఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ పార్ధసారధి వర్మ, బోరంపేట క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు, అజీజ్ నగర్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని డిప్యూటీ డీ.ఈ.ఓ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్ ల శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీ.ఈ.ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీ.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు (సూక్ష్మ పరిశీలకులు) పోలింగ్ రోజు ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయాన్ని, పోలింగ్ ముగిసే సమయాన్ని గమనించాలని అన్నారు. ఈ.వీ.ఎం ల పనితీరు పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, గ్రీన్ పేపర్ సీల్, క్రమ సంఖ్యలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మాక్ పోల్ నిర్వహణను పరిశీలించాలని, పోలింగ్ స్టేషన్లకు దారులను పరిశీలించడం, సీక్రసీ ఓటింగ్, పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన, ఫిర్యాదులను పరిశీలించాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో ఏ విధమైన సందేహాలు ఉన్నా వెంటనే జనరల్ అబ్జర్వర్ లకు తెలియజేయాలని అన్నారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్ర రావుకు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాలను ప్రభుత్వం సినీ పరిశ్రమకు కేటాయించింది. ఈ పిటిషన్‌పై కోర్టు గతంలో ఓమారు నోటీసులు జారీ చేసినా, అవి వారికి అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చింది. అనంతరం, విచారణను న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది. మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది.
సనాతన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు. టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హైందవ దర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వేళ్ళలని కరుణాకర్ రెడ్డి అన్నారు. దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందిచామని తెలిపారు. ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా డీవీఅర్కే ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు రూ.3,50,65,450 నగదును సీజ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మంగళవారం రూ. 90,000 నగదును సీజ్ చేయగా ఇప్పటివరకు 3,50,65,450 నగదును సీజ్ చేశారు. పోలీస్ అథారటీ ద్వారా 4,90,470 సీజ్ చేయగా ఇప్పటివరకు 48,88,,56,881 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లు 12 నమోదు కాగా ఇప్పటి వరకు 612 నమోదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 5 సేకరించగా ఇప్పటి వరకు 4,558 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్.పి సి 8 నమోదు కాగా ఇప్పటి వరకు 887 కేసులు నమోదయ్యాయి. నేడు 16 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 2,332 బైండోవర్ చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 108 ఇప్పటి వరకు 2,321 నక్కాస్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు కాగా ఇప్పటి వరకు 2076 నాన్ బెయిలబుల్ వారంట్ లను నమోదు చేశారు.
పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.




Total views : 92132