ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ డివిజన్ లో కెసిఆర్ భరోసాని వివరిస్తూ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రచారం చేశారు. బంజారాహిల్స్ లో జరిగిన అభివృద్ధిని వారు గుర్తు చేస్తూ ఎన్బీటి నగర్ లొ గడపగడపకి ప్రచారం చేశారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలెదుర్కొంటున్న పరిష్కారం చేశామని నాగేందర్ అన్నారు. ప్రజలు చెప్పినవే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలు లేకుండా చేశానని చెప్పారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
hyderabad
కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ సర్కార్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేదని, అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చిండని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్‌ని, కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర జంగయ్య యాదవ్ తో కలిసి పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యాట కుమార్ మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కుమార్ భార్య(రేణుక) కూడా మృతి చెందింది. యాట కుమార్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల బాధ్యత ఇప్పటివరకు బంధువులు చూసుకుంటున్నారు.
తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని, అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని, ఈ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబంధుతో డబ్బులు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుబంధును విడతలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణా వచ్చిందే నీళ్లు, నియామకాల కోసమని, కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు. మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు, యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీనిఎంచుకున్నట్లు తెలిపిన నవీన్ యాదవ్. జాయినింగ్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నవీన్ యాదవ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున్ కార్గే.
రేవంత్ రెడ్డి పాయింట్స్:
జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికిఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఎవరి పాలనలో ప్రజా జీవితంచక్కగా ఉందో ఆలోచించుకోవాలి. జంట నగరాల వ్యాప్తంగా పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక పీజేఆర్ మరణంతో మూగబోయింది. ఇప్పుడు యువ రక్తం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో జంట నగరాలకు నాయకత్వం లభించినట్లునేను అనుకుంటున్నాను. ఈరోజు తన నామినేషన్ ని వదిలివేసి కేవలం నియోజకవర్గం ప్రజా శ్రేయస్సు కోరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నవీన్ యాదవ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవకుడైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలను అజారుద్దీన్, నవీన్ యాదవ్ పాటిస్తూ ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం.
ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, ప్రగతి ఇలాగే కొనసాగాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లు కరోనా ఉన్నా ఐటీ రంగంలో విశేష వృద్ధి సాధించామన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నందునే నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామన్నారు. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తాం.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలువుతాయో లేదో చెప్పలేం కానీ 6 నెలలకో సీఎం మారడం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్రమోదీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది గమనించి ఎన్నుకోవాలన్నారు. బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.



Total views : 92154