తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
hyderabad
ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also..
Read Also..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు… మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. ఇక డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికలు అక్కడక్కడ చిన్నిచిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం నిరాశాజనకమైన విషయంగా చెప్పుకోవచ్చుతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకే ఓటర్ల ఆదరణ లభించిందని ఆయా సర్వేలు వెల్లడించాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కవిత వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ దృష్టికి తెచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, పక్క రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు బందోబస్తులో ఉన్నారు.
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు గుర్తించారు. కారును ఎవరైనా తగులబెట్టారా? లేదా ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం పేరుని ‘భాగ్యనగరం’గా మార్చుతామని హామీ ఇచ్చారు. గోషామహల్లో హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి రాజాసింగ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాజాసింగ్‌ను గెలిపించి అయోధ్య భవ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కమలం గుర్తుకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. ఈ మేరకు బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అవినీతిని రూపుమాపారని అన్నారు. కాగా హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన పలు ప్రచార కార్యక్రమాల్లో యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. మంగళ్ హట్లో ఆకాశపురి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించారు. జుమ్మెరాత్ బజార్ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా 6 బుల్డోజర్లను ఏర్పాటు చేసి సీఎం యోగి, బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్‌లపై పూల వర్షం కురిపించారు.
Read Also..
Read Also..
హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి. నవంబర్ 3న లైవ్ చికెన్ కిలో ధర రూ. 140ఉండగా ఇప్పుడు ధర రూ. 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్ లెస్ చికెన్ ధరల్లో కూడా తగ్గుదల ఇదేమాదిరి ఉంది. అక్టోబర్ 29న కార్తీక మాసం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. హిందూ మతానికి చెందిన ఎంతో మంది ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి తోడు, లక్షలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుండటంతో వారు కూడా మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నారు.
ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. మధుయాష్కీ నాకు సోదరుడితో సమానం. ఆయన్ను ఎల్బీనగర్ లో 30వేల మెజారిటీతో గెలిపించండి. మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత కాంగ్రెస్ ది. ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ ది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు అన్న ప్రత్యేక పాత్ర పోషిస్తారు. నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించినట్లే మధు అన్నను గెలిపించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసేదాంట్లో మధుయాష్కీ సంతకం ఉండబోతోంది. ఎల్బీనగర్ లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను సుధీర్ రెడ్డి నట్టేట ముంచిండు. అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు. మూసికి చైర్మన్ అయిన సుధీర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో మూసీలో తొక్కాలి అని విజ్ఞప్తినిచ్చారు.
తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది.




Total views : 92164