హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రమంజిల్ సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.
hyderabad
హైదరాబాద్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. డ్రగ్స్ తో పట్టుబడిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్ డే కోసం సంపత్ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాడు. కాగా.. 30 మంది కోసం ప్రేమ్ చంద్ డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లతో కలిపి పార్టీ అరెంజ్ చేశాడు.
నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో బయటపడిన అమ్మవారి విగ్రహం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని చెవిలో చెప్పిన అమ్మవారు. గత రెండు రోజుల నుండి వెతుకగా సుగాలిమెట్ట వద్ద బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో కోలాహలంగా మారిన సుగాలిమెట్ట ప్రాంతం. అమ్మవారిని దర్శించుకుని పూజలు టెంకాయలు అర్పిస్తున్న భక్తులు….
హైదరాబాద్ పబ్బుల్లో సోదాలు చేస్తున్న పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పోలీసులు. నిక్స్. డౌన్ టన్. పబ్బులు స్లీపర్ స్నిపర్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు. మొదటిసారి స్నిపర్ డాగులను వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది అందులో వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి పరిస్తితి ఆందోళన కరంగ వుంది అని తెలిసింది ఒస్మానియా లో చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం, వివరాల్లోకి వెళితే బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఒక ప్లాట్ లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం ఆ ప్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది అందులో కి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ ఏదో వెదుకుతూ ఉండగా ఒక్క బ్లాస్ట్ అవ్వటం ప్రక్కనే ఉన్న మసీదు కిటికీ అద్దాలు కూడా పగిలి పోవటం తో పెద్ద ఎత్తున చప్పుడు కావటం తో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండటం తో పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి అనుమానస్పద మృతి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించిన పోలీసులు. ఈమెరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్లోనే 246 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ వాటా 84 శాతంగా ఉందని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ కేసుల్లో నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈరోజు లోక్ సభలోకి ఆగంతకులు చొచ్చుకుని పోయిన సంఘటన విషయమై ఈ రోజు సాయంత్రం (13.12.2023) 7.30 నిమిషాలకు శాసనసభలోని స్పీకర్ గారి కార్యాలయంలో శాసనమండలి చైర్మెన్ మరియు శాసనసభ ప్రోటెం స్పీకర్ శ్రీ అక్బరుద్దీన్ ఒవైసి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి.శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై కూడ ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. శాసనసభ సమావేశాలు సజావుగా సాగాడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రొటెం స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జారీ చేయబడ్డ పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మండలి చైర్మెన్, శాసనసభ ప్రొటెం స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, డి.జి.పి., హైదరాబాదు పోలీసు కమీషనర్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్లోన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఆస్పత్రికి వెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఆసుపత్రి వద్ద బారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. తుంటి మార్పిడి తర్వాత కేసీఆర్ కోలుకుంటున్నారు.
Read Also..
Read Also..
హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విజయభాస్కర్ తో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వాటి గురించి ఇలా చేయడం సరికాదని విజయభాస్కర్ కు నచ్చ చెప్పారు. ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్యయత్నం చేశానని విజయభాస్కర్ తెలిపారు.



Total views : 92173