Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana కేసీఆర్‌ను పరామర్శించాన సీఎం రేవంత్‌ రెడ్డి

కేసీఆర్‌ను పరామర్శించాన సీఎం రేవంత్‌ రెడ్డి

by Satya
CM Revanth Reddy visited KCR

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రేవంత్‌ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఆస్పత్రికి వెళ్లారు. ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో కేసీఆర్ మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఆసుపత్రి వద్ద బారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. తుంటి మార్పిడి తర్వాత కేసీఆర్ కోలుకుంటున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014791
Total views : 81041

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.