hyderabad
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా యువతి యువకులే టార్గెట్‌గా డ్రగ్స్ దందా కొనసాగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్, రెండు గ్రాముల కొకైన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లోని హయత్ నగర్ నేతాజీ నగర్ లో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సంజయ్ అకస్మాత్తుగా మిస్సయ్యాడు. మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుండి వెళ్లిన విద్యార్థి సాయి సంజయ్ తిరిగి రాలేదు. హోమ్ వర్క్ చేయలేదని సంజయ్ తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన సాయి సంజయ్ రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.
సన్ బర్న్ కు అనుమతి లేకుండా టిక్కెట్ లు విక్రయిస్తుండటంపై మాదాపూర్ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి మండిపడ్డారు. అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ లో డ్రగ్స్ ను తీసుకువచ్చినా, అనుమతించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈవెంట్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సిసి కెమెరాలు కూడా అమర్చుకోవాలని అడిషినల్ డిసిపి సూచించారు. సన్ బర్న్ నిర్వాహకుల గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటివరకు 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని. పబ్బులలో అనుమతికి మించి ప్రవేశం లేదని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరిలో 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 8.8, తిర్యానీలో 8.9 డిగ్రీలు సోనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. రాబోయే మరో రెండు మూడురోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. చలికి తోడుగా హైదరాబాద్‌తో సహా పలు చోట్ల పొగ మంచు భారీగా పేరుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also..
Read Also..
గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన. బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న యశస్విని. తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ కి విచ్చేసిన యశస్విని. గత కొంత కాలంగా ప్రభుత్వం పై అనుచిత పోస్టులు పెడుతున్నారని సీఐడీ అరెస్ట్. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగా అరెస్ట్ అంటున్న టిడిపి నేతలు. అక్రమ అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టిడిపి నేతల డిమాండ్.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ లను పెంచడం, ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు డాక్టర్లు. టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది.
Read Also..
Read Also..





Total views : 92284