Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home TelanganaHyderabad ప్రసాద్‌కు ప్రమాణ స్వీకారం..

ప్రసాద్‌కు ప్రమాణ స్వీకారం..

by Satya
Prasad

సనాతన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు. టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హైందవ దర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వేళ్ళలని కరుణాకర్ రెడ్డి అన్నారు. దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందిచామని తెలిపారు. ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామన్నారు. వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా డీవీఅర్కే ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisements

You may also like

Our Visitor

036136
Total views : 181002

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.