ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (40) టాప్ స్కోరర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31) చెలరేగారు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పటిదార్ 50, కామెరూన్ గ్రీన్ 37, డుప్లెసిస్ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ 2, కమిన్స్, మార్కండే ఒక్కో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- RCB ఆధిపత్యం: క్వాలిఫయర్ 1లో GTపై భారీ విజయం..RCB ఆధిపత్యం: క్వాలిఫయర్ 1లో GTపై భారీ విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆధిపత్య ప్రదర్శన ఇది. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఈ రెండు జట్లను కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే వేరు చేసింది. కానీ క్వాలిఫయర్…
- IPL 2026 క్వాలిఫయర్ 1: ఫైనల్ టికెట్ కోసం RCB vs గుజరాత్ టైటాన్స్ సమరం..టాటా IPL 2026 క్వాలిఫయర్ 1 ధర్మశాలాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఒక భారీ పోరును అందిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది, ఓడిన జట్టుకు మాత్రం…
- Chennai Super Kings కుప్పకూలింది.. Gujarat Titans ఘన విజయం..Chennai Super Kings కుప్పకూలింది.. Gujarat Titans ఘన విజయం. చెన్నై సూపర్ కింగ్స్ ఛేజ్ అసలు సరిగా మొదలుకాలేదు. వేళ్ల గాయం ఉన్నప్పటికీ ఆడేందుకు వచ్చిన శాంసన్ మొదటి బంతికే అవుట్ కావడంతో సీఎస్కేపై వెంటనే ఒత్తిడి పెరిగింది. ఇన్నింగ్స్‌ను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 89163