సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందజేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ రేట్ కార్యాలయం సమీపంలో రెండురోజులుగా నిరవేదిక సొమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు యస్ టి యు ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వై రవీంద్ర నాగిరెడ్డి తో పాటు ఏపీటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిబాబు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వీరి డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లకు తమ ఉపాధ్యాయ సంఘం నాయకుల తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు నేడు నుంచి పిల్లల చదువులకు అవసరమయ్యే అమ్మబడి ట్యాబులు, యూనిఫామ్, బుక్స్, మిడ్డే మిల్స్ తదితర వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో మా వీధులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఈ సమ్మెబాట పట్టడానికి కారణం సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. అందరికీ మినిమం ఆఫ్ టైం స్కేల్ హెచ్ఆర్ఏడిఏ అమలు చేసి వేతనాలు పెంచాలి. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోని మార్చి మినిమం ఆప్షన్స్ వేతనాలు పెంచాలి. 10 లక్షల రిటర్మెంట్ బెనిఫిట్ గ్రాటివిటీ కల్పించాలి. సామాజిక భద్రత పథకాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ కార్డు సదుపాయాన్ని కల్పించాలి. పదవీ విరమణ వయసు 62 వేలకు పెంచాలి.వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలి. మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. అన్ని సంక్షేమ పథకాల తో పాటు, వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్య నియమాకాలు చేపట్టాలి.మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేరి లీవులు మంజూరు సదుపాయాన్ని కల్పించాలి. ప్రతి నెల ఒకటో తేదీకి వేతనాలు చెల్లించి సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
Jaganmohan Reddy
గుంటూరు.. అంగన్వాడి ల చేస్తున్న ఉద్యమానికి టిడిపి మద్దతు ప్రకటిస్తుంది. అంగన్ వాడి టీచర్లపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం లోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన జగన్ రెడ్డి నేడు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం బాధాకరం. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించడం లో రాష్ట్రప్రభుత్వం విఫలమైంది. గతంలో ఉన్న అంగన్వాడీ జీతాలు కంటే కేవలం 1000 మాత్రమే ఈ జగన్ రెడ్డి పెంచాడు. అంగన్వాడీలకు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ప్రచారాలు మాత్రమే చేసుకుంటున్నారు. అంగన్వాడీ లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు సీనియర్లకు 26000 పెంచాలని అడుగుతున్నారు. అంగన్వాడీ లు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం ఎగుర వేస్తుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించటం అత్యంత నిరంకుశ వైఖరికి, నియంత పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఐసీడీఎస్ కార్యాలయం వద్ధ మూడవ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డి బాధ్యత మరిచి నాలుగున్నర ఏళ్లుగా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి కేసులతో వేధిస్తున్నట్లు తెలిపారు. నా మహిళలు నా ఎస్సీ నా బీసీ అనే జగన్మోహనరెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు మహిళలు, బీసీలు, ఎస్సీలు అనే సంగతి తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సియం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన్నారు.





Total views : 90717