గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్‌గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పూజలకు ఖైరతాబాద్ భారీ గణపతి సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శమివ్వనున్నారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు మొదటి పూజ ప్రారంభం కానుంది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా నేరుగా సీఎం పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు, అధికారులు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90721