అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
Kcr
కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని, గత పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా, బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావు, పార్టీ తరఫున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాను కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది’ అంటూ ఆరోపించారు.
కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని కాంగ్రెస్ విమర్శించింది. లెక్కలతో గిమిక్ చేసిందని ఆరోపించింది. తెలంగాణ వచ్చాక కేవలం 60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2023కల్లా 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ది చెందినా గ్రామాలన్నీ కన్నీరు కారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పథకంలో చూసినా అవినీతి తాండవిస్తోందన్నారు. అందుకే నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలికిపడుతున్నారని మదన్ మోహన్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ఇలాంటి వివక్ష కొనసాగడం దారుణమన్నారు. కేవలం అధికార పక్షానికే పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అంశాలపై తాము కూడా PPP ఇస్తామని స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హరీష్ సూచించారు. ముందే నోట్ ఇస్తే తాము కూడా సిద్ధమయ్యేవారం కదా అంటూ మండిపడ్డారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడే మాట్లాడాలంటే ఎలా..? అని ప్రశ్నించారు. నివేదికను చదివే సమయం మాకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేసే అవకాశం తమకు ఉందన్నారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు.
Read Also..
Read Also..
పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని సూచించారు. పార్టీ ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హిప్ రిప్లేస్ మెంట్ చికిత్స చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, పార్లమెంట్ లో 93 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా ఇవాళ మరో 50 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో సభలు సజావుగా సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫున సభలలో వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీలకు సూచనలు చేస్తారని సమాచారం.
Read Also..
Read Also..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగ్‌లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో అయినా కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also..
Read Also..
గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రతిపక్షాలదే ప్రధాన భాగస్వామ్యం. ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత ప్రతిపక్షాలదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తుచేశారు. హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలవకున్నా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ఏం చేసింది. ఆర్థిక విధ్వంసం ఎలా జరిగింది, పదేళ్ల పాలనలో చేసిన వ్యవహారాలపై సంపూర్ణంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు మనసుంటే తెలంగాణ అభివృద్ధిని నిజంగా కోరుకుంటే మా పాలనకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ చదివిన గవర్నర్ ప్రసంగానికి అభినందలు తెలపాలని అన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, నాగార్జున తదితరులు పరామర్శించారు. ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పదేళ్ల కాలంలో కెసిఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్ర వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్ బి ఐ నివేదిక విడుదల చేసిందన్నారు. ఆ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84.2 శాతంతో రెండోస్థానంలో ఉందని తెలిపారు. పుష్కలంగా విద్యుత్, నీటి సౌకర్యం ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎంతో పురోగతిని సాధించామని వినోద్ కుమార్ తెలిపారు.
Read Also..
Read Also..
తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను స్వీకరించారు.
గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.




Total views : 89928