భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారుల పై దాడి చేసి చంపడానికి చేసిన కుట్రలను మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ లో జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఘటనపై పూర్తిగా విచారణకు ఆదేశించారు.
khammam district news
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనకి కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు అమలు చేసేందుకు పూనుకున్నామని, 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, ఇప్పటికే 2 హామీలు ప్రజలలోకి తీసుకొచ్చామని అన్నారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాలలోకి ప్రజాపాలనను తెచ్చామని, గత పదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కలలైనాయని, చిత్తశుద్ధితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులం కృషి చేస్తున్నామని, కిందిస్థాయి ఉన్నటువంటి బీదాసాదలకు ప్రభుత్వ పథకాలు అందాలనే మా తాపత్రయం అని అన్నారు. మేడిగడ్డను మేము కూడా సందర్షించామని, 6 లక్షల 71 కోట్లు రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని, అప్పులు తప్పు కాక పోయినా, సరైన రీతిలో ఆ నదులను సద్వినియోగం చేయలేదని,కేవలం రాచ ఠీవి అనుభవించేందుకు తెలంగాణను వాడుకున్నారని, విలాసాలు, భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టా రని అన్నారు. ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకుంటామని, గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులతో కొత్త సెక్రటేరియట్ కట్టారని, పేదోళ్ల కష్టాలు తీర్చకుండా, వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మీరిచ్చే ప్రతి అప్లికేషన్ కూడా కంప్యూటరైజ్ చేస్తామని, నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని, వట్టి కుండ చేశారని, తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండానే ప్రజాపాలన కార్యక్రమం పూర్తి చేస్తున్నామని, ప్రజల గుమ్మం ముందుకే పధకాలు వస్తాయని, పేదోళ్లకే ప్రాధాన్యత ముందుగా ఉంటుందని అన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం, మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. భక్తుల సౌకర్యం ఆలయ ఈవో వెంకటరమణ అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునెందుకు మార్కెట్లో ఏర్పాటుచేసారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డాన్సులు వేశారు. ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.
Read Also…
Read Also…
రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సత్తుపల్లి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 292 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నది. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 2,43,181 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్నిపోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఓటు వేసే అవకాశం కల్పించారు. సత్తుపల్లిలో కొన్ని గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు భారీగా మోహరించారు.సత్తుపల్లి నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఎన్నికల సిబ్బంది, రక్షణ బలగాలు సిద్ధమయ్యాయి.
సింగరేణి కార్మికుల ప్రాణాలను యాజమాన్యం బలితీసుకుంటుందని ఆరోపిస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు.దీంతో యాజమాన్యం బొగ్గు గనికి మొదటి షిప్టు లాకౌట్ ప్రకటించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెవన్ ఇంక్లైయిన్ బొగ్గు గనికి చెందిన కార్మికుడు కౌటం సంపత్ ఇంటి నుండి నైట్ షిప్టు డ్యూటికి వెళ్లుతుండగా మార్గమధ్యలో ముందు వెళ్లుతున్నలారీ నుండి బొగ్గు పెల్లలు మీద పడటంతో సంపత్ అక్కడిక్కడే మృతి చెందాడు.నూతన రహదారికి అధికంగా స్పీడ్ బ్రేకర్లు,మూల మలుపు ఉండటం, అధిక దూర భారంతో కార్మికులు తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారని కార్మికులు ,కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించక పోవటంతో ప్రమాదాలు జరుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాత రోడ్డును కార్మికులు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల , పాత రహదారి మూసివేయటం వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. యాతాల కుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నష్టపరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, సీలింగ్ భూములపై, గిరి వికాస్ బోరు బావుల విషయంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ.. ప్రజలకు మీరేం చేశారంటూ సండ్రాను నిలదీశారు. సండ్ర గిరిజనులకు సర్దిచెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రచారం మధ్యలోనే వెన్న తిరిగారు. సండ్రను గిరిజనులు అడ్డుకున్న సందర్భంలో… స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తుండటంతో సండ్ర అనుచరులు స్థానికులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు దిగారు. దీంతో గ్రామస్తులు సండ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి. బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, వెనకబడిన గ్రామాలు నేడు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాయి అని కొనియాడారు. సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానుందని వివరించారు. కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతి వర్గానికి ఉపయోగ పడుతుంది అన్నారు. జనవరి నుండి ప్రతి మహిళకు సౌబాగ్యా లక్ష్మి పథకం పేరుతో మూడు వేలును కేసీఅర్ అందించనున్నారు అని పేర్కొన్నారు. కార్ గుర్తుకు ఓటు వేసి బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుకున్నారు.
Read Also…
Read Also…
వరంగల్ న్యాయస్థానం వద్ద నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఖైదీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అక్కడ నుంచి పోలీసుల దృష్టి మళ్లించిన రాజు అనే ఖైదీ పరారయ్యాడు. పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖైదీ రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్య నేరం కింద ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ రాజును వాయిదా నేపథ్యంలో నేడు న్యాయమూర్తి ఎదుట వరంగల్ కమిషనరేట్ పోలీసులు హాజరుపరిచారు. ఖైదీ రాజు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు.
మందమర్రి మండలం, మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ కాలనీ ఏరియాలోని 20 వార్డులో అంగడి బజార్ ఏరియాలోని శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, కడారి వీరస్వామి, నాయకత్వంలో ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, మహిళకు ప్రతినెల 2500 రూపాయలు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, గృహ జ్యోతి ,ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పింఛన్లు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బుర్ర రాజు గౌడ్, సోతుకు ఉదయ్, వెల్ది సాయి కృష్ణ, శ్రీనివాస్, నోముల పోచ గౌడ్, ఆకుదారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, ప్రచారంలో పాల్గొన్నారు





Total views : 147205