కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
Krishna District
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, మొవ్వ (మ) కూచిపూడి లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొట్టిపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాల, బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈ నెల 11 నుంచి 13 వరకు కబడ్డీ పోటీలు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి 13 టీములు పాల్గొనున్నాయి. లక్ష రూపాయలు వరకు నగదు బహుమతి ఉంటుంది అని కన్వీనర్ గొట్టిపాటి సాయి అన్నారు. గెలిచిన వారికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు చే బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అని అన్నారు.
కృష్ణాజిల్లా, అవనిగడ్డ నాగాయలంక మండలం పెద్ద పాలెం గ్రామంలో దారుణం. తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన యువతి యొక్క తండ్రి,, తమ్ముడు. షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి రిఫర్ చేసిన వైద్యులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నాగాయలంక పోలీసులు.
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కొనియాడారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రంగా చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ. ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తరాలు మారినా, యుగాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి రంగా మాత్రమేనని ప్రసాద్ అన్నారు. పేద ప్రజల కోసం, ముఠా కార్మిక సంఘాల కోసం రంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు. తెలుగు వారు ఉన్నంతకాలం రంగా చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. కొంతమంది నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ, రంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజల అభిమానాన్ని సంపాదించారని బోడె ప్రసాద్ కితాబునిచ్చారు.