కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసృత్తవ్యాఖ్యలు చేసిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ,దత్త పుత్రుడుకు బుద్ధిచెప్పతారు. సుబ్రహ్మణ్యేర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు ప్రారంభించిన
మంత్రి,కోట్టు సత్యనారాయణ. మెపిదేవి దేవి లో కోలువైయిన్న శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి వారి అంగరంగవైభవంగా ప్రారంభయిన్నాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కోటి సత్యనారాయణకుంటబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ,స్వామిపుట్టలో పాలుపోసి, అనతరం ప్రతేకపూజలు నిర్వహించారు. తొలియత దేవాలయం అధికారులు, అర్చకులు బృందం అలయమర్యదులతో స్వాగతం పలికారు. అనతరం మంత్రి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై త్రీవరస్థాయిలో మండిపడ్డారు.
Krishna District
దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 గంటల సమయంలో దాడి జరిగింది. ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు, సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కృష్ణకి డబ్బులు తక్కువ ఇచ్చినందుకు దాడి చేశాడు. మద్యం మత్తులో గుంజా కృష్ణ దాడి చేశారు అని పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. స్మశానంలోనే ఈ దాడి చేసిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బందరు ఆర్డీవో ఎం.వాణి హాజరయ్యారు. లంక భూములు సాగు చేసుకుని జీవిస్తున్న నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మేలు కలిగేలా లీజ్ ను రెన్యూవల్ చేశామని సభాముఖంగా ఎమ్మెల్యే తెలిపారు. అర్హత కలిగిన 838 మంది లంక భూముల రైతులకు 760 ఎకరాల లీజు పట్టాలు పంపిణీ చేశారు. చల్లపల్లి మండలంలోని పాగోలు, మాజేరుల్లో 158 మందికి అసైన్డ్ భూములు, 39 ఎకరాలను 22ఏ నుంచి తొలగించి ధృవీకరణ పత్రాలు సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యి ఉంటే రాజధాని అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం,
అద్దె డబ్బులు సరిపడా ఇవ్వలేదని కోపంతో కన్నతండ్రి కోటే విష్ణు మూర్తి పై విచక్షణారహితంగా ఇనుప రాడ్డుతో దాడి చేసిన వైనం బాపులపాడు మండలం, హనుమాన్ నగర్ లో నివాసముంటున్న పెదపాడు మండలం కాజీ గూడెంకు చెందిన కొటే వెంకటరావు అనే వ్యక్తి ఇంట్లో చోటు చేసుకుంది తీవ్రంగా ముఖంపై గాయాలైన విష్ణుమూర్తిని 108 అంబులెన్స్ సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై ఏ డి ఎల్ జనార్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.