కృష్ణా జిల్లాలో ప్రశ్న రావణ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఛానల్ సీఈఓ గమనతో పాటు ఇంద్రసేన చౌదరి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రారంభమైన విచారణలో.. గమన నిర్వహిస్తున్న మూడు ఛానల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతో రావాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు దర్యాప్తులో భాగంగా గమన, ఇంద్రసేన చౌదరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సహకరించని పక్షంలో తదుపరి చర్యలపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Tag:



Total views : 221438