ఏపి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ వచ్చారు. అయితే క్రికెట్ ఆడడానికి వచ్చిన ఒక ప్లేయర్ కు అనారోగ్య సమస్య ఏర్పడటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది తెలుసుకున్న సబ్ కలెక్టర్ తన సొంత వాహనంలో ఆ ప్లేయర్ ను ఆసుపత్రికి తరలించారు. సబ్ కలెక్టర్ చేసిన పనికి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరూ ఫిదా అయ్యారు.
Let’s play Andhra program
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరులో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లను వారు తొలగించి విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.
గుంటూరు జిల్లాలో 26వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సిఎం పాల్గొనే లయోలా స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో లక్షా 25 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్తాయిలో పాల్గొంటారని తెలిపారు. సీఎం పర్యటన నిమిత్తం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అరీఫ్ హఫీజ్ అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో 2K రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ రన్ లో పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు, వాలంటరీలు మున్సిపల్ సిబ్బంది తో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల్లో రాణించే యువతకు ఉజ్జల భవిష్యత్తు ఉంటుందన్నారు. చైర్ పర్సన్ వెంకటరమణ జెండా ఊపి రన్ ప్రారంభించి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా యువత రాణించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.
Read Also..





Total views : 75406