లోక్ సభ ఎన్నికల(Lok Sabha election) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అరగంట తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఈసీని కలిశారు. ఈ క్రమంలో, రూల్ 54A ప్రకారం అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. నిబంధనలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి 1961లోని రూల్ 54ఏ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
543 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా, మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే విపక్షాలు ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నాయి. ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభ సీట్లలో కూటమి ఎక్కువగా గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మాత్రం వైసీపీ ఏర్పాటు చేస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో వెలువడే ఫలితాల కోసం అందరూ వేచి చూస్తున్నారు.
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.