సిఎం జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. పార్వతీపురం పట్టణంలో టిడిపి ఇన్ ఛార్జ్ బోనాల విజయచంద్ర నివాసంలో నక్కా మీడియాతో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఆపేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. రెండు నెలలు పాదయాత్రను ఆపగలిగారు కానీ ప్రజల్లో ఉన్న స్పందనను మాత్రం ఆపలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆత్మసంతృప్తి పొందారని విమర్శించారు. ఎన్నికలు త్వరలో వస్తున్నందున ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. అనంతరం అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్ధతుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు.
lokesh yuvagalam padayatra
రేపు 20 వ తేదీన మధ్యాహ్నము 2గంటల నుండి పోలిపల్లి గ్రామంలో యువ గళం – నవ శకం, టీడిపి ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభిమానుల తో పాటు భీమవరం, చింతల పూడి నియోజక వర్గాల టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడిపి రాష్ట్ర కార్యదర్శి, భీమవరం AMC మాజీ చైర్మన్,చింతల పూడి నియోజక వర్గ పరిశీలకులు, భీమిలి తాత్కాలిక పరిశీలకులు కోళ్ళ నాగేశ్వర రావు కోరారు.
యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ. ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2867.8 కి.మీ. 211వరోజు (28-11-2023) యువగళం వివరాలు అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు…
ఉదయం
8.00 – పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.
10.00 – అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.
10.15 – అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.
10.30 – అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం.
10.45 – అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.
12.30 – భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.40 – భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి.
1.40 – భట్నవిల్లిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – భట్నవిల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.00 – అనంతవరం సెంటర్ లో స్థానికులతో సమావేశం.
6.00 – గున్నేపల్లిలో స్థానికులతో సమావేశం.
7.45 – ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.
8.30 – ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.