నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన, మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి. తెలంగాణలో రహదారులకు, జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై నితిన్ గడ్కరీ తో చర్చించుకున్న వెంకటరెడ్డి. అధికారుల బృందం తోటి కలిసి కేంద్రమంత్రిని కలవనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
mp komatireddy venkat reddy
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించనున్న కోమటి రెడ్డి. ఉదయం 9 గంటల నుంచి సచివాలయంలోని 5 వ అంతస్తులోని 5F 11,12,13 Rooms పూజ,మరియు అధికారికంగా బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అనంతరం కొన్ని ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేస్తారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు, తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక. తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు….
తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్గా సారథ్యం వహించి, నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవడం హర్షణీయం. అందుకు సోదరుడు రేంవత్ రెడ్డికి నా శుభాకాంక్షలు. పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. అవ్వన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యార్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మాణం పంపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు.





Total views : 79380