ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన. గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ.యు నాయకులు గొల్లపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్, దారపురెడ్డి నాగభూషణం, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
Muncipal Workers
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గత 13 రోజుల నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది, వీధుల్లోని షాపుల ముందు చెత్తాచెదారం పడడంతో షాపు యజమానులకు ఏమి చేయాలో తెలలియక చెత్తను అంటించి వేస్తున్నారు.. దీంతో ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఆ చెత్తలో ఉండటం వల్ల ఆ పొగ వాసన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలత చూపాలని వారు విధుల్లోకి చేరితే పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయని, లేనిపక్షంలో చెత్త కుప్పలు మరీ పేరుకుపోయి అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. దీంతో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ వద్ద ధర్నా చేపట్టన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన మున్సిపల్ కార్మికులను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపడితే ఇలా ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేపించడం దారుణమన్నారు. నెలసరి వేతనం 26,000 ఇమ్మని అడుగుతున్నామే తప్ప గొంతేమ్మ కోరికలు కోరట్లేదన్నారు. తమ డిమాండ్ల పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం కారణంగా సమ్మె చేయడం జరుగుతుందని, ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ సోర్స్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నాలుగు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ప్రభుత్వంతో చర్చలు జరిపినా సఫలీకృతం కాకపోవడం వల్ల మూడు రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని, కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛభారత్ పేరుతో సచివాలయం సానిటరీ సెక్రటరీ తో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా స్వచ్ఛభారత్ పేరుతో సమ్మె ప్రారంభించిన రోజునే ఇలా చేయటం ఎవరికి ఉపయోగం కాదని ఏది ఏమైనా ప్రభుత్వనికి సమ్మె తొందరగా పరిష్కరించాలని చెప్పాలి. అదేవిధంగా ప్రధానమైన పారిశుద్ధ్యమంటే కను చూపులో ప్రభుత్వానికి ఎక్కడ కనబడుటలేదని పబ్లిక్ హెల్త్ కాపాడాలనుకుంటే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంచాలని తెల్లవారుజామునే వీధుల్లో శుభ్రం చేస్తేనే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంటుందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఈ సమ్మె మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతుందని హెచ్చరించారు.
Read Also..
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరిన సందర్భంగా మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, చర్చల పేరుతో కార్మికులను అవమానిస్తూ ఏ ఒక్క సమస్య పరిష్కరించక పోగా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పిన ప్రభుత్వం, తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ, కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. ఈ పొర్లు దండాల కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే సుబ్బరాయుడు, మార్కాపురం యూనియన్ సెక్రటరీ గొట్టం హరికృష్ణ, మరియు మున్సిపల్ కార్మికులు ఇమామ్ సాహెబ్ సలాం ఖాన్ ఆరేపల్లి రమణ బ్రహ్మం శ్రీనివాసులు, టి.శ్రీనివాసులు, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో నాయకత్వం వహించినారు.
Read Also..