కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో “నిజం గెలవాలి యాత్ర” లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి రూ 3 లక్షలు నగదు చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. నారా భువనేశ్వరి ని చూసేందుకు భారీగా మహిళలు, పురుషులు తరలి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు నారా భువనేశ్వరి కాన్వయ్ ని అడ్డుకొని తమ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని, జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు. వచ్చేది మా ప్రభుత్వంమే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
Nara Bhuvaneshwari
శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలని బస్సు యాత్ర చేస్తానని అంటున్నారు, నిజం గెలవాలని మీరు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది న్యాయస్థానాన్ని తప్పు పట్టేట్లుగా ఉంది. మీరు ఎంతో తెలివైన వారు ప్రజలు అమాయకులు ఏమైనా వింటారు అనేగా మీ ఉద్దేశ్యం. తన సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి చనిపోయేలా చేసిన చంద్రబాబుని ఏమి అనని భువనేశ్వరి ఈరోజు తప్పు చేసి దోషిగా జైలుకు వెళితే తాను పోరాటం చేస్తాను అనడం ఎంత దారుణం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది మీరు నిజం గెలవాలని చెప్పడం. చంద్రబాబుని జైల్లో పెడితే ప్రజలు ఎవరైనా బాధపడ్డారా? చంద్రబాబు నాయుడు కరెక్ట్, ఎన్టీఆర్ గారిదే తప్పు అనేది పోనీ భువనేశ్వరి గారు చెప్పగలరా? నారా లోకేష్ కెమెరా మెన్ గంగ సినిమాలో లాగా తన తండ్రిని పక్కకు తప్పించి తాను చంద్రబాబు స్థానంలోకి రావడానికి చూస్తున్నారని నుమానం. రెండు అక్రమ పార్టీలు అక్రమ కలయిక ఈరోజు జిల్లాలో పెట్టారు. ఇక్కడ సీటు ఎవరికి ఇస్తారో తెలియక టీడీపీ జనసేన నాయకులు మదన పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన ఆర్థిక లాభం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు. దీనికి కాపు సామాజిక వర్గం సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. జనసేన టీడీపీ కూటమి ఎన్నికల లోపు ఎన్ని ముక్కలు అవుతుందో చూడండి.
గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు. యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో, పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని తెలిపారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. జైలు గోడల ఆవల ఉన్న తన భర్త క్షేమం కోసం తనతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నానన్నారు. నారా బ్రాహ్మణి కూడా స్పందిస్తూ వారిని ఆ లేఖ తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందన్నారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు నారా బ్రాహ్మణి.
వైసీపీ వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి? అని భువనేశ్వరి ప్రశ్నించారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి…చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనున్నారు.
కాసేపట్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం కానుంది.. నిజం గెలవాలి పేరుతో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పర్యటించన్నారు నారా భూవనేశ్వరి .. నేటికి 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు… అరెస్టును ఖండిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం.. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లనున్న భువనేశ్వరి.. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25న చనిపోయిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శిచనున్న భువనేశ్వరి.. అనంతరం ఈ నెల 17న మరణించిన చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శ మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి… రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం..
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు. పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు.