నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది. విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది. అయితే ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. తేలికపాటి వర్షాలకే రోడ్లపై గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఆటో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగ పోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Nellore
మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి మేలు చేస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించే కార్యకర్తలను తగు రీతిలో పదవులు ఇచ్చి గౌరవిస్తామని మంత్రి కాకాని వివరించారు.
నెల్లూరు జిల్లా, ఎస్ పేట మండలం ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా ప్రాంగణంలో దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్ పై దాడి చేసిన ముగ్గురు యువకులు. అడ్డువచ్చిన సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ యువకులు. దర్గాలో మహిళలు ఉన్న చోట ఉండకుడదని ఈఓ యువకులకు చెప్పినందుకు వివాదం…
-పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్గా ఈఓ మహమ్మద్ హుస్సేన్.
ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది. ఆయకట్టుకు నీరు విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు. బుచ్చి, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇటీవలి ఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు. టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కిక్ ఎక్కితే గాని డాక్టర్లు వైద్యం చేయడం లేదు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే నిరుపేదలు హడలిపోతున్నారు. దీనికి తోడు ప్రతి పనికి రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కట్లు కట్టాలంటే 200 రూపాయలు చెల్లిస్తేనే కడతారు. ఒక జబ్బుకు సరైన మందు ఇవ్వకుండా వేరే మందులు ఇస్తున్నారు. దురద మందుకు బదులుగా రాబిస్ ఇంజక్షన్ ఇస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల మోజులో పడి ఆస్పత్రికి డాక్టర్లు రావడమే మానేశారని చెబుతున్నారు. దీంతో వాచ్ మెన్ లే వైద్యుల అవతారం ఎత్తుతున్న దుస్థితి నెలకొంది. గత నెలరోజులుగా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుల మీద తప్పులు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ క్లీనిక్ లు నడుపుతున్న ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
ఏపీలో కుంభకోణాలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే అని స్పష్టం చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు. రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళతాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు చేరిన బాబా పాద రక్షలు ఒక చారిత్రక ఘట్టం. 1930 జూన్ 23న బాబా నెల్లూరు జిల్లాలోని గుడివాడకు చేరుకున్నారు. ఆయన పాదాలకు ధరించిన పాద రక్షలు ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. బాబా పాద రక్షలు ఒక సాధారణ పాద రక్షల వంటివి కావు. అవి చాలా సన్నగా ఉంటాయి మరియు వాటిపై ఏవైనా రంగులు లేదా అలంకరణలు ఉండవు. అవి చాలా శక్తిని కలిగి ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. బాబా పాద రక్షలను తాకడం లేదా వాటిని చూడడం వల్ల కూడా అనారోగ్యం, బాధ మరియు ఇతర ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. బాబా పాద రక్షలు ప్రస్తుతం హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీ రాములు స్మారక మందిరంలో భద్రపరచబడ్డాయి. ఈ పాద రక్షలను ప్రతి సంవత్సరం శ్రీ పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా ప్రజలకు ప్రదర్శిస్తారు. బాబా పాద రక్షల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బాబా పాద రక్షలు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి ఒక సాధారణ వ్యక్తి పాదాల కంటే సన్నగా ఉంటాయి. బాబా పాద రక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. అవి ఎప్పుడూ ధూళి లేదా మరేదైనా అపరిశుభ్రతతో కప్పబడవు. బాబా పాద రక్షలను చాలా గౌరవంగా చూస్తారు. వాటిని తాకడానికి లేదా వాటిని చూడడానికి అనుమతి ఇవ్వబడిన వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. బాబా పాద రక్షలు శ్రీ పొట్టి శ్రీ రాములు జీవితంలో ఒక ముఖ్యమైన చిహ్నం. అవి ఆయన శక్తి మరియు దయను సూచిస్తాయి.
ఆర్టీసీ డ్రైవర్లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కోసం గాలిస్తున్నామన్నారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం. ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. హారన్ కొట్టారనే నెపంతో కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. డ్రైవర్లపై వైసీపీ మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.