పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న సాయంత్రం ఎన్నికలు ముగిసిన కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ -ECP కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాత్రం తమ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ -PTI గెలుపొందిందని ప్రకటించుకున్నారు. తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ వెల్లడించారు. తమ గెలుపును ఆపేందుకు ఈసీపీ కుట్ర పన్నుతోందంటూ పీటీఐ చేసిన ఆరోపణలను జాఫర్ ఇక్బాల్ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలిపారు. Read More..
pakisthan
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఉన్నాడు. 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో భారత్ ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.





Total views : 79138