పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము.. కొత్త పార్లమెంట్లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. 21వ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీకగా ఉంది. ఈ నూతన పార్లమెంట్ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని తాను విశ్వసిస్తున్నానని రాష్ట్రపతి తెలిపారు.
President Draupadi Murmu
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొదటిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముర్ము కొత్త పార్లమెంట్లో ఇదే తన తొలి ప్రసంగం అని చెప్పారు. సభా కార్యకలాపాలు సజావు సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. 21వ శతాబ్ధంలో నవ భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీకగా ఉంది. ఈ నూతన పార్లమెంట్ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని తాను విశ్వసిస్తున్నానని రాష్ట్రపతి తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు.
శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు. ఈ పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్లనున్నారు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అదేవిధంగా పద్మశ్రీ, సంత్ కబీర్, ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడి..పోచంపల్లి చేనత పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సైతం సందర్శించి మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలించనున్నారు.
ఉత్తరాఖండ్ లో నవంబరు 12న ఓ టన్నెల్ కూలిపోగా, 17 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టన్నెల్ లోనే చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను ఎట్టకేలకు సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. అధికారులు, సిబ్బంది పడిన శ్రమకు ఫలితం దక్కింది. కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, టన్నెల్ నుంచి కార్మికులను విడతల వారీగా బయటికి తీసుకువచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా చిన్యాలిసౌర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వారికి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లేంతవరకు ఆసుపత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.