రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. పెట్రోపావ్లోవ్స్క్, కమ్చట్స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది. రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. తూర్పు తీర ప్రాంత నగరమైన లావ్స్కీ 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. అయితే పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన లావ్స్కీ నగరంలో లక్షా80వేల మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. భూకంప తీవ్రతకు లావ్స్కీ 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి. ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్చట్స్కీ పలు ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 149338