Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home International అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం…

అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం…

by Prakash
India Business Conference

అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్‌లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై చర్చ జరుగనున్నది. ఈ అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామికశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ డైరెక్టర్ లేఖలో కోరారు.

Advertisements

You may also like

Our Visitor

019234
Total views : 90134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.