Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home International రష్యాలో ఉగ్రవాదులు నరమేధం..!

రష్యాలో ఉగ్రవాదులు నరమేధం..!

by Satya
Terrorists massacred in Russia



రష్యా(Russia)లో మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ముష్కరులు బాంబులు దాడి..

రష్యాలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. రాజధాని మాస్కో(Moscow) ఉత్తర శివారు ప్రాంతం క్రాస్నోగోర్స్క్‌లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలు(Music concert hall)పై ముష్కరులు బాంబులు విసరడంతో కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ భయానక ఉగ్రదాడిపై దర్యాప్తు మొదలైంది.

ఘటనలో 70 మందికి పైగా మృతి.. మరో 100 మందికి పైగా గాయాలు..

ఉగ్రవాదులు ఎలాంటి అనుమానం రాకుండా భద్రతా బలగాల యూనిఫాం ధరించి కన్సర్ట్ హాలు(Concert hall)లోకి ప్రవేశించారని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. గ్రెనే‌డ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డారని వివరించింది. కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని తెలిపింది. ఇంటర్నేషనల్(International) మ్యూజిక్ బృందం(Music group) ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు. మృతదేహాలను పరిశీలిస్తున్నామని, బాధితుల సంఖ్య పెరగొచ్చని పేర్కొన్నారు.

ఈ దాడికి బాధ్యత తమదేనని ఐసిస్ ప్రకటన విడుదల..

ఈ దాడికి బాధ్యత తమదేనని ఐసిస్ ప్రకటన విడుదల చేసింది. అనుబంధ గ్రూపు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. మాస్కోతో పాటు ఇతర నగరాల్లో ఇస్లామిస్ట్ గ్రూపులు దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన కొద్ది రోజులకే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం…


ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి.
హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న మరో నౌకపై దాడి చోటు …
ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు.
అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు. తాజాగా హర్మూజ్‌ …

Follow us on : FacebookInstagram, YouTube & Google News


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023128
Total views : 141089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.