Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home International రష్యాలో భారీ భూకంపం

రష్యాలో భారీ భూకంపం

by Satya
రష్యాలో భారీ భూకంపం

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. పెట్రోపావ్‌లోవ్స్క్, కమ్‌చట్‌స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది. రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. తూర్పు తీర ప్రాంత నగరమైన లావ్‌స్కీ 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. అయితే పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన లావ్‌స్కీ నగరంలో లక్షా80వేల మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. భూకంప తీవ్రతకు లావ్‌స్కీ 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి. ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ పలు ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: